కేటీఆర్ హీరోగా ‘పొలిటికల్ పిచ్చోడు’

Publish Date:Apr 13, 2024

Advertisement

సినిమావాళ్ళు ఎవరైనా ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే పేరుతో  సినిమా తీయాలని అనుకుంటే, ఆ సినిమాలో హీరోగా యాక్ట్  చేయడానికి ఒక రాజకీయ నాయకుడు అన్నివిధాలా అర్హుడు.  అతనెవరో ఈపాటికి మీకు అర్థమైపోయిందిగా.. ఎస్... అతనే  కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు. కేటీర్ 

వ్యక్తిగతంగా పిచ్చోడు కాదు.. బాగా చదువుకున్నవాడు..  మాటకారి, సబ్జెక్ట్ వున్నవాడు. వ్యక్తిగతంగా కొంచెం కూడా  మెంటల్ లేదు. పొలిటికల్‌గా మాత్రం కేటీఆర్ పెద్ద పిచ్చోడు.  అందుకే ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే మాటకి కరెక్ట్.గా  సూటవుతాడు. కేటీఆర్ పొలిటికల్ పిచ్చితనం గురించి  పదేళ్ళకు పైగానే అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారం  పోయిన తర్వాత ఆ పిచ్చితనం మరింతగా ప్రకోపించి పీక్స్.కి  చేరుకుంది.

శుక్రవారం (ఏప్రిల్ 12)  ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కి  ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ విషయంలో  మరింత క్లారిటీ వచ్చింది.  ఇంటర్వ్యూ మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు కేటీఆర్  చెప్పిందే చెప్పి తన రాజకీయ వాచాలత్వాన్ని ప్రదర్శించారు.  ఫోన్ ట్యాపింగ్ వెనుక మీరు వున్నారా? అని అడిగితే నాకు  సంబంధం లేదు అని సమాధానం చెప్పి, అక్కడితో ఆగకుండా  పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రస్తావించి, వాళ్ళకి కూడా  సంబంధం వున్నట్టే కదా అంటారు. ఇదేం డొక్కులో లాజిక్కో  అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను లై డిలెక్టర్  పరీక్షకి రెడీ.. కానీ, నాతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ  అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా లై డిలెక్టర్ పరీక్షకి కూర్చోవాలి  అంటారు. అది కాదయ్యా, నువ్వొక్కడివే లై డిటెక్టర్ పరీక్ష  చేయించుకుని సుద్దపూసలా బయటపడొచ్చు కదా.. మధ్యలో  వాళ్ళనెందుకు లాగుతావు?  

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇంకా చాలా సెకలు ప్రదర్శించారు. ఫలానా సమయంలో ఫలానా వాళ్ళు ఫోన్  ట్యాపింగ్ చేశారు.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా  ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తెలంగాణ ఉద్యమ సమయంలో  కాంగ్రెస్ నాయకులే చేశారు అంటూ సోది చెప్పుకొచ్చారు. మీ  ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా అంటే మాత్రం చేసింది  లేదా చేయలేదు అని తేల్చకుండా, నాకు మాత్రం సంబంధం  లేదు అని అంటారు. అక్కడితో ఆగకుండా రేవంత్ రెడ్డి  ప్రభుత్వం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లను ట్యాప్ చేస్తోందని మాటమాటకీ  అన్నారు. ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడుతూ కేటీఆర్ చాలా  తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటూ వుండవచ్చు. కానీ  ఆయన మాట్లాడుతున్న తీరు ఆయన రాజకీయ అజ్ఞానాన్ని,  రాజకీయ అహంకారాన్ని స్పష్టంగా బయటపెట్టింది.  

యాంకర్ ఏదైనా కీలకమైన ప్రశ్న అడిగితేచాలు... ఓ పేపర్ని కెమెరాకి చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు నెరవేర్చలేదని  రాగం అందుకున్నారు. మీకు అహంకారం ఎక్కువైపోయిందని  అందరూ అనుకుంటున్నారని అంటే, నేను అస్సలు  అహంకారినే కాదు అంటూ అహంకారంగా సమాధానం  చెప్పారు. అంచేత, ఎవరికైనా ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే  సినిమా తీయాలన్న ఇంట్రస్ట్ వుంటే కేటీఆర్ని  సంప్రదించవచ్చు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.