హైదరాబాద్ పాతబస్తీలో రాత్రి వేళల్లో చోటుచేసు కున్న విచిత్ర మైన ఘటనల వెనక ఉన్న అసలు కథను పోలీసులు బయటపెట్టారు.హైదరాబాదు నగరంలోని ఐఎస్ సదన్ పోలీసుల దృష్టికి వరుసగా షాపుల అద్దాలు పగలగొ డుతున్న సంఘటనలకు సంబంధించి కేసులు నమోదౌతూ ఉండడంతో అనుమానం మొదలైంది.ఇది సాధారణ చోరీ ప్రయత్నమా.. అల్లరిమూకలా పనా... అన్న సందేహం రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
ఓ నలుగురు పోకిరీ యువకులు క్వాలిస్ కారులో రాత్రి వేళల్లో నగర వీధుల్లో సంచరిస్తూ షాపింగ్ మాల్స్, పెద్ద అద్దాలున్న దుకాణాలను టార్గెట్ చేసుకొని గిల్లెర్‌కు గోలీలు అమర్చి అద్దాలపై గురి పెట్టి కొట్టి పగలగొట్టి వినోదించడం అలవాటుగా మార్చుకున్నారు. ఇలా అద్దాలు ధ్వంసం అవుతుంటే చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
సైదాబాద్ నుంచి మలక్‌పేట, సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు అనేక ప్రాంతా ల్లో ఈ ఘటనలు పునరా వృతం కావడంతో పోలీ సులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలను జల్లెడ పట్టిన ఐఎస్ సదన్ పోలీసులు చివరకు నిందితులను గుర్తించారు. ఈ ఘటనలకు సంబంధించి ఖలీద్ బిన్ అలీ, మూసా బావాజీర్, హిలాల్ మొహియుద్దీన్, ముద్దాసిర్ ఖురేషిని అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి క్వాలిస్ వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, గిల్లెర్, గోటీలు స్వాధీనం చేసుకు న్నారు. మొత్తం 11 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లుగా బయటపడటంతో నలుగురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాత్రివేళల్లో ప్రజల్లో భయం కలిగించిన ఈ ‘అద్దాల టెరర్’ కథకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-crack-down-on-rowdies-36-218686.html
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.
2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.