పోలవరం ఫైల్స్ దహనం కేసు.. ఇదీ అసలు కథ!

Publish Date:Aug 19, 2024

Advertisement

ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమార్కులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ  హయాంలో పలు శాఖల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది.  వైసీపీ నేతలు అధికారుల సహకారంతో అందిన కాడికి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాల వ్యవహారంపై దృష్టిసారించింది. ఫలితంగా ఒక్కొక్కరి అవినీతి బండారం వెలుగులోకి వస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో కమిటీలు వేస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నారు. విచారణ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారోనన్న ఆందోళన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్టు కాగా.. జోగి రమేశ్ చుట్టూ  ఉచ్చు బిగిసింది. అయితే, పలు ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న క్రమంలోనే ఫైల్స్ మాయం లేదా దగ్ధం అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఫైల్స్ దగ్దం వెనుక అసలు కథ ఏమిటో వెలికి తీస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం ఘటన చోటు చేసుకుంది. 

పోలవరం భూసేకరణ ఫైళ్ల దహనం ఘటనపై విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చినరాముడును నియమించారు. విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తొలుత అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని సీనియర్‌ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కె.కళాజ్యోతి, ఆఫీసు సబార్డినేట్‌ కె.రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న డిప్యూటీ తహశీల్దార్లు ఎం.కుమారి, ఎ.సత్యదేవికి నోటీసులు జారీ చేశారు.   వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అగమ్యగోచరంగా మార్చేశారు. ఆ పార్టీ నాయకులు భూ పరిహారాన్ని అందిన కాడికి దోచుకున్నారు. అక్రమాలకు కొందరు అధికారులు అండగా నిలవడంతో నకిలీ భూ పట్టాలు పెట్టి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో పోలవరం భూ పరిహారం చెల్లింపుల్లో అక్రమాలను మాయం చేయాలని భావించి ఫైళ్ల దహనానికి పాల్పడ్డారు.  ఫైళ్ల దహనం వెనుక పలువురు వైసీపీ నేతలు, అధికారుల హస్తం ఉందన్న విమర్శలు ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల్లో పరిహారం చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు భూ సేకరణలో కొండ పోరంబోకు భూములకు అప్పట్లో నకిలీ డీఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి కోట్లలో పరిహారాన్ని పక్కదారి పట్టించారు. ఇందులో పలువురు వైసీపీ నేతలు, రెవెన్యూ, ప్రాజెక్టు భూ సేకరణ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫైల్స్ ను పరిశీలించకుండా కొందరు అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అర్హులకు అందాల్సిన పరిహారాన్ని కాజేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు తగలబెట్టినప్పుడు కీలక అధికారులు సెలవులో ఉండటం, మరి కొందరు అందుబాటులో లేకపోవటం గమనార్హం. దీనినిబట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను దహనం చేశారన్న వాదన  బలంగా వినిపిస్తోంది. ఫైళ్ల దహనంపై అధికారులు విచారణ జరిపి కాలినవన్నీ సంతకాలు లేని జిరాక్స్ పేపర్లు, అవి పనికిరానివని అధికారులు చెప్పడం వెనక ఏదో మతలబు ఉందన్న చర్చ జోరుగా జరుగుతుంది.

అధికారుల విచారణ తీరుపై మంత్రి కందుల దుర్గేశ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిత్తు కాగితాలేనని మీరు ఎలా తేల్చేస్తారు? ఎవర్నయినా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫైళ్ల దగ్దం వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో భూ పరిహారం అక్రమాల్లో చక్రంతిప్పిన కొందరు దళారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. పోలవరం భూసేకరణ ఫైళ్ల దహనం ఘటనపై పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ తమకు పరిహారం అందలేదని, ఇప్పుడు ఫైళ్లు దహనం చేయడంతో మాకు పరిహారం అందించామని అధికారులు చెబితే మేము ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దగ్దమైన ఫైళ్లు చిత్తు కాగితాలే అని అధికారులు విచారణలో తేల్చినా.. అసలు కథ వేరే ఉందన్న వాదన స్థానికంగా బలంగా వినిపిస్తోంది. నకిలీ డీ ఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు పరిహారం సొమ్మును దోచుకున్నారని, ప్రస్తుతం ఆ వివరాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే ఫైళ్లను దహనం చేశారని, ప్రభుత్వం ఈ విషయంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ముంపు గ్రామాల లబ్ధిదారులు కోరుతున్నారు.

By
en-us Political News

  
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.