పోలవరం మరో అమరావతేనా?.. ప్రాజెక్టు కథ ముగిసినట్లేనా?

Publish Date:Apr 24, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం కథ ఇంక ముగిసిందా? ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఉద్దేశానికి జగన్ సర్కార్ తిలోదలాకిచ్చేసిందా? అన్న ప్రశ్నకు ఏపీ కొత్త జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమని అనుకోవలసి వస్తుంది. 
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న విషయాన్ని తాను చెప్పలేనని కుండ బద్దలు కొట్టేశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందనీ, అది ఏ స్థాయిలో దెబ్బతింది, దానిని ఎలా మరమ్మతు చేయాలి, ఎంత వ్యయం అవుతుంది ఇత్యాది విషయాలన్నీ పరిశీలించిన తరువాతే పోలవరం పురోగతిపై ఒక నిర్ణయానికి రాగలమని అంబటి చెప్పారు. 
మూడేళ్లుగా పోలవరాన్ని మూలనపడేసి ఇఫ్పుడు గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్లే పోలవరం పరిస్థితి ఇలా తయారైందని అన్నారు.  ఈ విషయంలో పోలవరం నిర్మాణంలో భుజకీర్తుల కోసం చంద్రబాబు పడిన తాపత్రయమే ఈ పరిస్థితికి కారణమని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలవనరుల శాఖ అనుమతులతోనే పనులు జరిగాయి కదా అన్న విలేకరుల ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేశారు. మీ ప్రశ్నలకు నేను జవాబివ్వడం కాదు...నేను చెప్పింది మీరు రాసుకోండంటూ  అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి గత మూడేళ్లుగా జరగాల్సి మట్టి పని నిలిచిపోవడ వల్లనే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతుండగా.. మంత్రి అంబటి రాంబాబు మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపించారు.
డయాఫ్రం వాల్ ఏ స్థాయిలో దెబ్బతిందన్న అంశం తేలాకే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తేలుతుందని అన్నారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన స్థలంలో గుంతలు పడ్డాయన్న ఆయన అక్కడి నీటిని తోడేయడానికి రెండు వేలకు పైన వ్యయమౌతుందని విరించారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే...ఇప్పటి వరకూ డయాఫ్రం వాల్ ఎంత మేర దెబ్బతింది అన్న విషయంపై నిపుణుల కమిటీ నివేదికే ఇవ్వలేదు. ఇక నీటిని తోడేయడానికి ఎంత వ్యయం అవుతుందన్న విషయంపై రాష్ట్ర జల  వనరుల శాఖ అధికారులు చెబుతున్న అంకెకు, అంబటి చెప్పిన అంకెకూ పొంతనే లేదు. అసలు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు పోలవరం ప్రాజెక్టుతో సంబంధమే లేదన్నట్లుగా అంబటి వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ పోలవరం అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పోలవరం సందర్శన అయితే పూర్తయ్యింది కానీ ఇంకా నివేదిక ఇవ్వలేదు. నివేదికకు ముందే నష్టం ఇంత, ఖర్చు ఇంత అంటూ అంబటి విలేకరుల సమావేశంలో ప్రకటించడాన్ని బట్టి నివేదిక కేవలం నామమాత్రమేననీ, భారీ వ్యయం బూచి చూపి పొలవరం ఎత్తు తగ్గించి చాపచట్టేయడమో లేదా మూడు రాజధానుల పేరు చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసిన చందంగా పోలవరం పనులకు ఫుల్ స్టాప్ పెట్టేయడమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 
ఇక జల రంగ నిపుణులైతే...నీటిని తోడడానికి అంత భారీ వ్యయం అవసరం లేదనీ, డయాఫ్రం గోడలను కొద్ది పక్కకు జరిపితే నీరు దానంతటదే దిగువకు వెళ్లిపోతుందనీ చెబుతున్నారు. 
దేశంలో దాదాపుగా పోలవరమే చివరి బహుళార్థక ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టు విషయంలో రాజకీయం చేస్తూ వైఫల్యాలకు ప్రత్యర్థి పార్టీలను నిందిస్తూ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా ప్రభుత్వమే ప్రయత్నాలు చేయడం పట్ల జల వనరుల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతున్న మంత్రి దానికి సరిచేయడానికి మూడేళ్లలో ప్రభుత్వం ఎందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదనడానికి మాత్రం స్పష్టమైన జవాబు ఇవ్వడం లేదు. 
అమరావతి విషయంలో ఎలా అయితే...అమరావతే రాజధాని అంటూ తొలుత ప్రకటనలు గుప్పించి, ఆ తరువాత దానిని నిర్వీర్యం చేశారు.ఏపీ జీవ ప్రదాయిని అంటూ కొనియాడిన పోలవరం పురోగతిని ఉద్దేశ పూర్వకంగా ఆపేసి జగన్ సర్కార్ చోద్యం చూస్తోందని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.