అనవసరంగా కాంగ్రెస్ లో చేరాను.. పోచారం.!
Publish Date:Aug 11, 2026
Advertisement
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకపోయినా, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పని సరై కాంగ్రెస్ లో చేరానని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది, అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది, అయినా కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను కప్పుకున్నది జాతీయ జెండా అనీ, కాంగ్రెస్ జెండా ఎంత మాత్రం కాదనీ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం స్వయంగా చెబితేనే కాంగ్రెస్ లో చేరానన్న ఆయన.. ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. తాను వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేశాననీ, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదనీ చెప్పిన పోచారం.. నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డిని ఈ విషయమై సూటిగా ప్రశ్నించానని చెప్పారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని పోచారం తెలిపారు. Pocharam Srinivas Reddy, Revanth Reddy Congress, Banswada Constituency, Telangana Politics News, Pending Bills Release, Pocharam News Telugu
http://www.teluguone.com/news/content/pocharam-srinivas-reddy-25-228688.html





