పెట్రో మంటలపై పెదవి విప్పిన మోడీ.. అంతా మీవల్లనే.. భగ్గుమన్న విపక్షాలు

Publish Date:Apr 27, 2022

Advertisement

ఇంచుమించుగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వచ్చి యూపీ సహా నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన పది రోజుల మొదలు పెట్రోల్. డీజిల్ ధరలు, ఇంచుమించుగా ప్రతి రోజూ ఎంతోకొంత పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల బ్రేక్’ కు ముందు వందలోపున  ఉన్న లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు సెంచరీ మార్క్ దాటి, 120 నాట్ అవుట్’ దశకు చేరుకున్నాయి. పెట్రోల్ డిజిల్ ధరలతో పాటుగా, నిత్యావసర సరకులు, కూరగాయలు, ఒకటనేమిటి మందులు సహా అన్నిటి ధరలు చుక్కలు చూస్తున్నాయి. సామాన్యులు, అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలు, దిక్కులు చూస్తున్నారు. పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విషయంగా ఇంతవరకు పెదవి విప్పని ప్రధాని, ఈరోజు ( బుధవారం) పెదవి విప్పారు. అంతే కాదు, ఏపీ, తెలంగాణ సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల పై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ను తగ్గించలేదన్నారు.అలా చేయడం ద్వారా కేంద్రం అందించిన ప్రయోజనాలు క్షేతస్థాయిలోని ప్రజల వరకు వెళ్లడం లేదన్నారు. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు మోదీ. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు మోదీ. ఇలా చేయడం మంచిది కాదన్నారు. ఒక రాష్ట్రం ధరలు తగ్గించకపోవడం వల్ల, ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై కూడా పడుతుందన్నారు. "మహారాష్ట్ర, బంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు.. కొన్ని కారణాల వల్ల.. ఈ విషయంలో కేంద్రం మాట వినడం లేదు. అలా చేయడం వల్ల ప్రజల పై భారం పడుతోంది. నవంబర్‌లోనే  ఈ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించావాల్సింది , కానీ తగ్గించ లేదు. ఇప్పటికైనా, వ్యాట్ తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

అయితే, మోడీ ఆరోపణను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. వ్యాట్ విషయం జోలికి వెళ్ళకుండా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా, కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో పెంచిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఎ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ మీద లీటరుకు రూ.9.48, డీజిల్ పై రూ.3.56 ఉన్న ఎక్సైజ్ డ్యూటీ మోడీ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్ పై లీటరుకు రూ. 27.90, డీజిల్ పై రూ.21.80 కు చేర్చిందని సుర్జీవాలా చెప్పు కొచ్చారు. ప్రభుత్వానికి ప్రజలను ఆదుకునే ఉద్దేశం ఉంటే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని అయన సూచించారు. 

అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ లోంచి 41 శాతం తిరిగి రాష్ట్రాలకే వస్తుందని, అదే విధంగా రాష్ట్రాలు విదిస్తున్న వ్యాట్ వలన ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలలో లీటరుకు రూ.30 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతుందని, ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే, ఆ మేరకు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందని, మరో వంక కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వాక్సిన్, ఫ్రీ రేషన్ అందిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే పరిస్థితి లేదని అంటున్నారు. అదే సమయంలో కొవిడ్, యుద్ధం (రష్యా-ఉక్రెయిన్) యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నా వాస్తవాన్ని, రాజకీయ పార్టీలు విస్మరించరాదని అంటున్నారు.
 

By
en-us Political News

  
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.