పీకే ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలలో కొత్త పొత్తులు!

Publish Date:Apr 18, 2022

Advertisement

హస్తినలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ తెలుగు రాష్ట్రాలలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతోందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది.  ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న  బీజేపీ, వైసీపీలకు రాజకీయ సలహాదారు పీకేయే కావడంతో తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు తెలుగుదేశంతో ఎన్నికల పోత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ శిశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ అయితే తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీతో ఎటువంటి సంబంధాలూ లేవనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అంత ప్రభావమంతంగా లేకపోయినప్పటికీ..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి గట్టి ప్రత్యర్థిగా ఉందనడంలో సందేహం లేదు. నిత్యం నిప్పు-ఉప్పులా విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకునే తెరాస, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు అన్నది వినడానికి అసంభవం అనిపించేలా ఉన్నా జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులు కారణంగా బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసకురావలసని అవసరం ఎంతైనా ఉందని పీకే గత కొంత కాలంగా వివిధ పార్టీల నేతలతో జరుపుతున్న సమాలోచనలలో ప్రతిపాదిస్తూనే ఉన్నారు.

వాస్తవానికి పీకే సూచనలూ, సలహాలతోనే  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ కోసం మహారాష్ట్ర సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులతో సమాలోచనలు జరిపారన్నది పరిశీలకుల విశ్లేషణ. 

ఈ నేపథ్యంలోనే పీకే సోనియాగాంధీ సహా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అధికార పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో  కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తాయన్న విశ్లేషణలు జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో ఇక్కడి పరిస్థితులను  బట్టి అటువంటి విశ్లేషణలు తెలుగు రాష్ట్రాల మీడియాలో అంతగా కనిపించడం లేదు.
మొత్తం మీద తెలంగాణలో కేసీఆర్ బీజేపీని దీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగేందుకు సుముఖత చూపుతారనే భావించాలి. గతంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న సంగతి విదితమే. నాడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ సర్కార్ లో తెరాస భాగస్వామిగా ఉన్నారు.

ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం అగ్రెసివ్ గా కదులుతున్న నేపథ్యంలో బీజేపీ దూకుడును నిలువరించడానికీ, అలాగే కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికార పీఠం దక్కకుండా అడ్డుకోవడానికీ బీజేపీయేతర శక్తులన్నీఏకం కావాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, కేసీఆర్ రాజకీయ సలహాదారు పీకే కాంగ్రెస్ అధినేత్రితో భేటీ కలిపి చూస్తే తెలంగాణలో తెరాస, కాంగ్రెస్ ల మధ్య పొత్తు అసంభవమేమీ కాదనే భావించాలి. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభావం ఏమంత లేకపోవడం వల్ల జగన్ కు ఆ పార్టీని కలుపుకు పోవడానికి పెద్దగా అభ్యంతరాలేమీ ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 
ఏది ఏమైనా పీకీ షేక్ హ్యాండ్ తెలుగు రాష్ట్రాలలో కొత్త సమీకరణాలకు తెరలేపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.