Publish Date:Jun 29, 2025
వైసీపీ సీనియర్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వైసీపీ అధికరంలో ఉన్నన్నాళ్లూ దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కలుగులో దూరిన ఎలుకలా మారిపోయారు. కేసుల చట్రంలో ఇరుక్కుని బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు. అసలాయన రాజకీయాలలో ఉన్నారా? ఉంటే వైసీపీలోనే ఉన్నారా? అసలెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్రలకు సమాధానం లభించని పరిస్థితి నెలకొంది. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ వదిలేసిందన్న చర్చ మాచర్ల నియోజకవర్గంలో ఓ రేంజ్ లో జరుగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఏమంత క్రియాశీలంగా ఉండటం లేదు.
దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులలో ఉన్న పిన్నెళ్లి పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఒక సారి జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఆయనపై ఇంకా పలు కేసులు ఉన్నాయి. ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా క్రియాశీలంగా ఉండేందుకు వెనుకాడుతున్నారు. అసలు జనంలోకి రావడం లేదు. జనం వరకూ ఎందుకు పార్టీ నాయకులు, క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడం లేదు. పార్టీ జెండా ముట్టుకోవడం లేదు. వైసీపీ తరఫున గళమెత్తడానికి సైతం జంకుతున్న పరిస్థితి. ఇటీవలి జగన్ పల్నాడు పర్యటనలో కూడా పిన్నెళ్లి జాడ కనిపించలేదు.
ఇదిలా ఉంటటే జగన్ మాత్రం చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలూ, క్యాడర్ ఇంటింటికీ వెళ్లి మరీ ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే ఆ ఆదేశాల మేరకు పిన్నెళ్లి పని చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పల్నాడు వైసీపీలో కూడా పిన్నెళ్లి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పుంజుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. అదే సమయంలో ఆయనను పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తత పరిస్థితుల్లో పిన్నెళ్లి మునుపటిలా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో వైసీపీతో ఆయన రాజకీయ ప్రయాణం దాదాపు ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైళ్లకు వెళ్లేందుకు సద్ధపడాలని, పార్టీ నేతలూ క్యాడర్ అందరూ బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ పిలుపునిచ్చిన తరుణంలో కేసులకు భయపడి బయటకు రావడం మానేసిన పిన్నెళ్లిని పార్టీ పదవి నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pinnelli-chapter-closed-in-ycp-39-200874.html
ఎట్టకేలకు భారత్ యువసేన ఇంగ్లండ్ గడ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగురవేయగలిగింది. కారణం.. ఒకటి శుభ్ మన్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్.
మస్క్ పెట్టిన పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒకరు అధ్యక్షులు కావాలంటే.. అందుకు ఫస్ట్ వారు జన్మతహ అమెరికా పౌరులై ఉండాలి. 35 ఏళ్ల పైబడి వయసుగల వారై ఉండాలి. ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మస్క్ కి లేవు. ఆయన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు.
తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు.
అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు బాగా ఇప్పుడు తెలిసివస్తోంది.
దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎన్జీ షెడ్ల వరకూ సాగింది.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ ముందుండి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది.
తిరుమల లో ఈ నెల 15, 16 తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీశైలం జలాశయం గేట్లను పరిశీలించిన నిపుణుడు కన్నయ్య నాయుడు..
శ్రీశైలం జలాశయాన్ని రిటైర్డ్ ఇంజినీర్, ప్రాజెక్టుల గేట్లు నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు.
పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.