పింకీ ఫింగర్ సిండ్రోమ్.. మొబైల్ వాడేవారిలో వచ్చే ఈ సమస్య గురించి తెలుసా.!
Publish Date:Aug 1, 2026
Advertisement
పింకీ ఫింగర్ సిండ్రోమ్ అంటే.. పింకీ ఫింగర్ సిండ్రోమ్ అనేది చిటికెన వేలు , దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రభావితం చేసే ఒక సమస్య. ఇది తరచుగా ఉల్నార్ నరంపై ఒత్తిడి వలన సంభవిస్తుంది. ఈ నరం చిటికెన వేలుకు , ఉంగరపు వేలులోని కొన్ని భాగాలకు స్పర్శ జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ నరంపై ఒత్తిడి పడినప్పుడు, అది వేళ్లలో జలదరింపు, తిమ్మిరి , నొప్పికి కారణమవుతుంది. పింకీ ఫింగర్ సిండ్రోమ్ లక్షణాలు.. చిటికెన వేలులో తిమ్మిరి లేదా చిమచిమలాడటం, చేతిలో బలహీనతగా అనిపించడం ఈ సమస్యలో ప్రదాన లక్షణం. అలాగే.. వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, వేళ్లలో నొప్పి లేదా మంటగా అనిపించడం. భుజాన్ని ఎక్కువసేపు వంచి ఉంచితే సమస్య పెరుగడం వంటి లక్షణాలు ఉంటాయి. పింకీ ఫింగర్ సిండ్రోమ్ ఎలా నివారించాలి? చేతులను ఎక్కువ సేపు ఒకే స్థితిలో ఉంచకూడదు, మొబైల్ వాడేటప్పుడు సరైన పొజిషన్ లో వాడాలి. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే.. పింకీ ఫింగర్ సిండ్రోమ్ ప్రారంభ లక్షణాలు తరచుగా తేలికపాటివిగా ఉంటాయి, కాబట్టి ఈ లక్షణాలు సాధారణ అలసట లేదా అధికంగా పని చేయడం వల్ల కనిపిస్తున్నాయేమో అని లైట్ గా తీసుకుంటారు. అయితే, చిటికెన వేలు లేదా చేతితో సమస్యలు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. కొంతమందిలో సమస్య ముదిరే కొద్దీ, వారు చేతి కండరాలలో బలహీనత, వేళ్లను కదపడంలో ఇబ్బంది లేదా మంటగా అనిపించడం వంటి లక్షణాలను కూడా ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఈ లక్షణాలు చాలా రోజులు లేదా వారాల పాటు కొనసాగితే న్యూరాలజిస్ట్ లేదా ఆర్థోపెడిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. అవసరమైతే వైద్యుడు శారీరక పరీక్ష, నరాల పరీక్ష లేదా ఇతర పరీక్షల ద్వారా సమస్యకు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించగలుగుతారు. సకాలంలో చికిత్స చేయడం ద్వారా నరాలపై ఒత్తిడిని తగ్గించి, పరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చు. అందువల్ల చేతులు లేదా వేళ్లలో మార్పులను గమనిస్తే వాటిని విస్మరించకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.
టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషికి తెలియని, అంతుబట్టని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కొన్ని పరిస్థితులను చాలామంది పెద్ద సమస్యలేమీ కాదులే అని లైట్ తీసుకుంటారు. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఇవన్నీ చిన్నవే అని కూడా అనుకుంటారు. కానీ అనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. చేతి వేళ్లలో ఎప్పుడైనా ఒక రకమైన వింత అనుభూతి, పట్టులో మార్పు, లేదా తరచుగా అసౌకర్యం వంటివి అనుభవిస్తే, దాన్ని 'పింకీ ఫింగర్' సిండ్రోమ్ అని అంటారట. చాలామందికి దీని గురించి తెలియదు. అయితే ఈ సమస్య ఎవరూ నిర్లక్ష్యం చేయకూడని సమస్య. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
అప్పుడప్పుడు చేతులను, వేళ్లను సాగదీయాలి. మోచేతిపై నిరంతరం ఒత్తిడి పెట్టడం మానుకోవాలి. నొప్పి లేదా తిమ్మిరి ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/pinky-finger-syndrome-34-227716.html





