పిడమర్తి పోటీ ఖాయం.. సత్తుపల్లి నుంచా, కంటోన్మెంట్ నుంచా?

Publish Date:Jul 24, 2023

Advertisement

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేయడంతో రాష్ట్రంలో పార్టీలన్నీ టికెట్ల కేటాయింపు పై దృష్టి సారించాయి.  గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు కసరత్తులు మొదలు పెట్టేశాయి.  రాష్ట్రంలో జోష్ మీద ఉన్న  కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలోకి వచ్చి చేరుతుండటంతో ఆ పార్టీ టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల జాబితా రూపొందించే విషయంలో భారీ కసరత్తే చేయాల్సి వస్తుంది.  ఇక అధికార బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.  

బీజేపీ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నంతగా జోష్ మీద ఉన్న పార్టీ.. ఇటీవల డీలా పడింది. పార్టీ తరఫున నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకని నియోజకవర్గాలే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది.  ఏ పార్టీ సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న గట్టి పట్టుదలతో ఉంది. కర్నాటకలో ఇలాగే చేసి సక్సెస్ సాధించడంతో ఆధిష్ఠానం తెలంగాణలో కూడా అదే ఫార్ములాను ఉపయోగించాలని భావిస్తోంది. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే.. ఇటీవలే పార్టీలోకి వచ్చి చేరిన నేతలు, తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతల మధ్య పార్టీ టికెట్ కోసం పోటీ పడుతుండటమే. 

అది పక్కన పెడితే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన పిడమర్తి రవికి  వచ్చే ఎన్నికలలో పోటీ నిమిత్తం టికెట్ ఖాయమన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఆయనను పార్టీ ఎక్కడ నుంచి అభ్యర్థిగా రంగంలోకి దింపుతుంది అన్న విషయంలో మాత్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కంటోన్మెంట్ లేదా.. లేదా  గత రెండు ఎన్నికలలో పోటీ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఆయన పోటీలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పిడమర్తి రవి టికెట్ హామీతోనే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కోరుతున్నట్లుగా కంటోన్మెంట్ టికెట్ దక్కి అవకాశాలైతే అంతంత మాత్రంగానే ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పిడమర్తి ఇష్టం ఉన్నా లేకున్నా సత్తుపల్లి నుంచే రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.  

అయితే సత్తుపల్లి నుంచి పిడమర్తికి టికెట్ ఇస్తే పొంగులేటి మద్దతు ఎంత వరకూ ఉంటుందన్నది పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సత్తుపల్లి నుంచి పొంగులేటి మట్టా ఆనంద్ కు పార్టీ టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కోరి ఉన్నారు. దీంతో పిడమర్తి ఒక వేళ సత్తుపల్లి నుంచే పోటీ చేయాల్సి వస్తే మట్టా ఆనంద్ ను పొంగులేని ఎలా సముదాయిస్తారన్నది ఆసక్తికరం. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.