పేర్ని నానికి పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ తండ్రి శాపనార్ధాలు.. ఎందుకంటే?
Publish Date:Jul 14, 2026
Advertisement
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రాణాంతకమైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్ననిరంజన్ ను మరణానికి ముందు పవన్ కల్యాణ్ వారింటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. దీనిపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. నిరంజన్ మరణం అనంతరం.. నిరంజన్ తల్లిదండ్రులు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్నినానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ కుమారుడు నిరంజనం ఆకస్మిక మృతికి పేర్నినాని.. పవన్ పై చేసిన వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు. తనకుమారుడిపై ప్రేమతో పరామర్శించడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరంజన్ ను ఎంతో కృంగదీశాయనీ, ఆ మనస్థాపంతోనే తన కుమారుడు ఎంతో ప్రేమగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పేర్ని నాని మాట్లాడిన అనుచిత మాటలు నిరంజన్‌ను మానసికంగా ఎంతో కుంగదీశాయని, ఆ తీవ్ర మనస్థాపం వల్లే తమ కుమారుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడనీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా కండరాల క్షీణతకు సంబంధించిన ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ నిరంజన్ మంచానికే పరిమితమైన నిరంజన్.. పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా చూడాలని ఆకాంక్షించాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో, ఆయన స్పందించి హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లారు. అక్కడ అతడిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, ధైర్యం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పవన్‌ను కలవాలనే తన జీవితకాల కోరిక నెరవేరడంతో నిరంజన్ ఎంతో సంతోషపడ్డాడు. అయితే.. పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తాను ఎంతో గౌరవించే నాయకుడిని అలా అవమానించడం తట్టుకోలేకపోయాడు. ఆ బాధాకరమైన వీడియోను నిరంజన్ పదే పదే చూస్తూ, తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాడని అతని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఒక పక్క శారీరక అనారోగ్యం, మరోపక్క మనసుకు తగిలిన ఈ మానసిక గాయం కారణంగానే నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించి, హఠాన్మరణానికి దారితీసిందని తండ్రి ఆరోపించారు. "ఆ చిన్నపిల్లాడి ఆరోగ్యం మీద, చివరి రోజుల్లో ఉన్న ఒక ప్రాణం మీద వెటకారం చేసి, వాడి మనసును తీవ్రంగా గాయపరిచిన పేర్ని నానికి ఈ పాపం ఖచ్చితంగా చుట్టుకుంటుందని ఆ తండ్రి ఆవేదనతో అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక నిరుపేద, అనారోగ్యంతో ఉన్న బాలుడి పరిస్థితిని కూడా వదలకుండా విమర్శలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమని నిరంజన్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని అనుభవించాల్సిందేనని వ్యాఖ్యానించారు. కొడుకును కోల్పోయిన కడుపుకోతలో ఉన్న ఆ తండ్రి వ్యక్తపరిచిన భావోద్వేగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజనులు పేర్ని నానిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/perni-nani-s-remarks-on-pawan-kalyan-are-reason-for-niranjans-death-36-225956.html





