Publish Date:Apr 30, 2022
వైసీపీమాజీ మంత్రుల తీరు చూస్తుంటే.. పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనిపించక మానదు. సీఎం అభీష్టం మేరకు ఆయన అప్పగించిన బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని వారు చెప్పిన మాటలు పెదవుల చివరి నుంచి వచ్చినవేనన్నఅనుమానాలు పార్టీ కేడర్ లోనే వ్యక్తమౌతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుజిల్లాలో చేసిన రచ్చమరువక ముందే.. ఆ స్థాయిలో కాకపోయినా మరో మాజీ మంత్రి పేర్ని నాని తన అసమ్మతినీ, అసంతృప్తినీసున్నితంగానే అయినా గుర్తించదగ్గ స్థాయిలో ప్రదర్శించారు. కేంద్ర మంత్రి పర్యటనలో మాజీ మంత్రి పేర్ని నాని అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. పర్యటన ఆద్యంతం ఒక ప్రేక్షకుడిలా దూర దూరంగా ఉండిపోయారు.
గిలకల దిండి హార్బర్ పరిశీలనకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్ శుక్రవారం పర్యటించారు. మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి కేంద్ర మంత్రి గిలకలదిండి హార్బర్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని కూడా హాజరయ్యారు. అయితే ఆయన కనీసం మంత్రుల దగ్గరకు కూడా రాలేదు. ఏదో సంబంధం లేని కార్యక్రమానికి హాజరైనట్లుగా వారికి దూరంగా ఉండిపోయారు. మంత్రి సిదరి అప్పలరాజు స్వయంగా వెళ్లి పనుల పరిశీలనకు రావలసిందిగా కోరినప్పటికీ పేర్ని నాని పట్టించుకోలేదు.
ఆ తరువాత జరిగిన సభలో మాత్రం మంత్రి మాట్లాడారు. ఆ మాటలు కూడా ముక్తసరిగా, ఆయన సహజ వాగ్ధాటిని భిన్నంగా ఉన్నాయి. కేంద్ర మంత్రి తెలుగులో చక్కగా మాట్లాడతారని ప్రశంసించి...తాను పనుల పరిశీలను దూరంగా ఉండటానికి ఎప్పుడూ చూసే పనులే కాదా అని ముక్తాయింపు ఇచ్చారు.
పేర్ని నాని కేంద్ర మంత్రి పర్యటనకు హాజరై కూడా దూరదూరంగా మెలగడం, ముక్త సరిగా మాట్లాడటానికి కేబినెట్ లో స్థానం దక్కలేదన్న అసంతృప్తే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటే.. పార్టీ వర్గాలు తాను ఉంటే కొత్త మంత్రి స్వేచ్ఛగా మెలగలేరన్న భావనే పేర్ని నాని ఈ కార్యక్రమంలో అంటీముట్టనట్లు వ్యవహరించడానికి కారణమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/perni-nani-distances-himself-from-central-ministers-programmee-39-135252.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.