నేను సీఎం జగన్ పాలేరునే.. పేర్ని నాని దిగజారుడుతనం..
Publish Date:Sep 30, 2021
Advertisement
అవును, నేను సీఎం జగన్ పాలేరునే.. అని మంత్రి పేర్ని నానినే స్వయంగా మీడియా ముఖంగా గొప్పగా ప్రకటించుకున్నారు. ఇంతకంటే దిగజారుడు తనం ఇంకేమైనా ఉంటుందా? అంటూ సోషల్ మీడియా ఏకిపారేస్తోంది. ప్రజలంతా కలిసి.. ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ఇందుకేనా? తాడేపల్లి ప్యాలెస్‌లో పాలేరు పని చేయడానికా? జగన్ ఆడే రాజకీయ క్రీడలో.. పాలేరులా, బానిసలా, కట్టప్ప వారసుడిలా.. పొలిటికల్ డ్రామా రక్తి కట్టించేందుకా ఆయన్ను ఓట్లేసి గెలిపించింది? అంటూ నిలదీస్తున్నారు ప్రజలు. ఈ మాట పవన్‌కు కౌంటర్ ఇచ్చేందుకే అన్నారనుకున్నా.. వాస్తవంలో కూడా చాలా మంది మంత్రులు పాలేరులుగానే పని చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అంటున్నారు. ప్రభుత్వం అనేది ప్రజల సమూహం. మంత్రిమండలి అనేది ప్రజలను పరిపాలించే సమూహం. ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్ అన్నట్టు.. ముఖ్యమంత్రి మిగతా మంత్రుల కంటే కాస్త ఎక్కువ. అంతే. రాజ్యాంగం ప్రకారం మిగతా మంత్రులంతా సమానమే. కానీ, ఈరోజుల్లో ఆ రాజ్యాంగ స్పూర్తి ఎక్కడుంది? సీఎం అంటే సూపర్ బాస్‌లా తయారైంది. ముఖ్యమంత్రి చెప్పిందే వేదం. ఆయన మాటే శాసనం. మిగతా మంత్రులంతా ఆయనకు ఊడిగం చేసే పాలేరులే అన్నట్టు తయారైంది పరిస్థితి. డమ్మీలను మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం పొలిటికల్ స్ట్రాటజీగా మారింది. ఏపీలో అనేక మంది మంత్రులు.. అసలు ఏ శాఖకు మంత్రులో, వారినసలు ఎందుకు మంత్రులను చేశారో, మంత్రిగా చేసేందుకు వారికున్న అర్హతలేంటో.. సామాన్యులకు ఓ పట్టాన అర్థం కాదు. కేవలం కుల, మత, ప్రాంత.. లెక్కల బేరీజుతోనే చాలా మంది మంత్రులు, ఉపముఖ్యమంత్రులూ అయ్యారు కానీ, వారికి ఏ కోశాన ఆ అర్హత లేదనేది జనం అభిప్రాయం. జగన్ కనుసన్నల్లో పడి ఉండటమే.. బాస్ చెప్పినట్టు చేయడమే.. వారి పని. ఆ విషయం నిస్సిగ్గుగా మంత్రి పేర్ని నానినే ఒప్పుకోవడం మరింత శోచనీయం. ఎలాంటి సిగ్గు-ఒగ్గు లేకుండా.. అవును, నేను సీఎం జగన్ పాలేరునే అని పేర్ని నాని ప్రకటించుకోవడం రాజకీయాల్లో పతనమవుతున్న విలువలకు నిదర్శనం.
http://www.teluguone.com/news/content/perni-nani-comments-on-jagan-goes-viral-25-123787.html





