ప్రయాగ్ రాజ్ లో రాహుల్ ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమానికి అనుమతి ఉపసంహరణ.!

Publish Date:Aug 6, 2026

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష  నేత రాహుల్ గాంధీ  విద్యార్థులతో జరప తలపెట్టిన ముఖాముఖి  ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది.  ప్రయాగ్‌రాజ్   కేంద్రంగా జరగాల్సిన ఈ బహిరంగ సభ అనుమతిని చివరి నిమిషంలో ప్రభుత్వం నిరాకరించడంపై  యూపీ సర్కార్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ప్రయాగ్‌రాజ్‌లోని   కేపీ గ్రౌండ్‌లో  శనివారం (ఆగస్టు 8)   రాహుల్ గాంధీ విద్యార్థులు, నిరుద్యోగ యువతతో నేరుగా మాట్లాడేలా  ఛాత్రోన్ కీ గూంజ్ పేరిట  సభ  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తొలుత అనుమతులు లభించినప్పటికీ.. మైదాన నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే కాయస్థ పాఠశాల ట్రస్ట్ హఠాత్తుగా వెనక్కు తగ్గింది.  దీనితో కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

యూపీలో భారీ వర్షాలు,  శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ  కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది.   అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.    రాజస్థాన్‌లోని కోటా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నగరాల్లో కూడా రాహుల్ కార్యక్రమాలకు ఇలాగే ఆటంకాలు సృష్టించారని, ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. 

మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా  సోషల్ మీడియా వేదికగా  స్పందించారు. విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీ వస్తుంటే ప్రభుత్వం ఎందుకు అంతగా భయపడుతోందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ కూడా కాంగ్రెస్ నేతకు మద్దతుగా నిలిచారు. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుందని, ఇలాంటి సభలను అడ్డుకోవడం ప్రభుత్వ బలహీనతను, భయాన్ని బయటపెడుతోందన్నారు.  

ఉత్తరప్రదేశ్‌లో పోటీ పరీక్షల ప్రక్రియల్లో జరుగుతున్న వరుస అక్రమాలు, పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీలో జాప్యం వంటి అనేక అంశాలపై విద్యార్థులు  అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులతో భేటీ అయి వారి ఆవేదనలను తెలుసుకోవాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థుల మద్దతు ప్రతిపక్షాలకు లభిస్తే తమ అధికారానికి ముప్పు తప్పదన్న భయంతోనే యూపీ ప్రభుత్వం ఈ సభను అడ్డుకుంటోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులతో రాహుల్ గాంధీ భేటీ  అవుతారని చెబుతున్న  కాంగ్రెస్ ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.   

 Rahul Gandhi Prayagraj Meeting,  Chhatron Ki Goonj UP, Congress Vs BJP Uttar Pradesh, Priyanka Gandhi Comments

By
en-us Political News

  
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.