నిజంగానే పెమ్మసాని..ఈవీఎం ట్యాంపర్ చేయించారా?
Publish Date:Aug 10, 2025
Advertisement
ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ కామెంట్లు ను బట్టీ చూస్తే... ఏపీ పైనా కొందరు గురి పెట్టి.. ఇక్కడ ఈవీఎంలను ట్యాంపర్ చేశారు. అందుకు ప్రధాన కారకుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు ప్రజలకు కనీసం తెలియని ఇతడికి మూడున్నర లక్షల పై చిలుకు మెజార్టీ ఎలా వచ్చిందని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. అసలు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? దాని పూర్వాపరాలు ఏంటని ఒక సారి చూస్తే.. పోలింగ్ క్లర్కు, పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్, అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్.. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్ మ్యానేజ్‌మెంట్, ట్రైనింగ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, లైసనింగ్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్స్, ర్యాండమైజేషన్, కౌంటింగ్ రూమ్ ఇలా పోలింగ్ కమ్ కౌంటింగ్ లోని వివిధ స్థాయిలలో ఉంటారు అధికారులు. ఆ ప్రక్రియలు కూడా అంతే సమానంగా పెద్ద ఎత్తున ఉంటాయి. గ్రామపంచాయతీ సర్పంచ్- డైరెక్ట్/ ఇండైరెక్ట్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మండల ప్రెసిడెంట్- డైరెక్ట్ /ఇండైరెక్ట్, జెడ్పీటీసీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన వారు చెప్పేదాన్నిబట్టీ చూస్తే.. ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. విపరీతమైన క్రాస్ చెక్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరక్కుండా జాగ్రత్త వహిస్తుంటారు. ఈవీయం లు అంటే, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ లు.. ఇవి అంత తేలిగ్గా హ్యాకింగ్ కు గురికావు. వాటికి సిగ్నల్ రిసీవింగ్, ట్రాన్స్మిషన్ చేసే పరికరాలు, నెట్ కనెక్టివిటీ లాంటివి ఏమీ ఉండవు. ఇవన్నీ కల్పిత గాథలు. ఎలక్షన్ కమిషన్ నియమించిన అబ్జర్వర్స్ సమక్షంలో మూడు స్థాయిల్లో జరిగే ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ అధికారులు / ఉద్యోగులు, ఈవీయం వివిధ ప్రత్యేక నంబర్లను కలిగి ఉన్న ఈ మూడు పరికరాలు లు అనగా ఏ కంట్రోల్ యూనిట్, ఏ బ్యాలెట్ యూనిట్, ఏ వీవీ ప్యాట్ లు ఏ ప్యాటర్న్ లో, ఏ పోలింగ్ స్టేషన్ కు వెళతారో / యో అలాట్ చేసిన వారికే తెలియదు. అక్కడ, ఆ పోలింగ్ స్టేషన్ లో ఎందరు ఓటర్లు ఉంటారో కూడా ఈవీయం కు సంబంధించిన డేటాలో ఉండదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఉండే సమాచారం మాత్రమే మొత్తం ఓటర్ల సంఖ్య చెబుతుంది. పోలైన ఓట్ల సంఖ్య తెలియజేస్తుంది. ఆ సంఖ్యకు అనుగుణంగా పార్టీలు / అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కౌంటింగ్ సమయంలో తెలుస్తుంది. పోలింగ్ పూర్తి కాగానే పోలింగ్ ఏజెంట్ల, అబ్జర్వర్ లు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు .. సమక్షంలో బ్యాటరీని ఆఫ్ చేసి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ లను సీల్ చేసి రిసెప్షన్ సెంటర్ కు పోలీసు బందోబస్తు మధ్యన తీసుకొస్తారు. అక్కడినుంచి అదేబరోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్ కు తరలించి పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా గళ్ళు వేసి ఉంచిన స్ట్రాంగ్ రూం లో తాళం వేసి, సీలు వేసి భద్రపరుస్తారు. ఆ స్ట్రాంగ్ రూంకు సీలువేసే సమయంలో కూడా పోటీ చేసిన అభ్యర్థులు / ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. వీడియోగ్రఫీ చేస్తారు. ఒకే తలుపు ఉండి, అన్ని కిటికీలను మూసేసి ప్లైవుడ్ లేదా ఇటుకలతో కట్టిన నిర్మాణం చేసి సీల్ చేస్తారు, లైట్లు ఆఫ్ చేసి- షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ రూం కు ఇరవైనాలుగు గంటలూ పోలీసు పహారా ఏర్పాటు చేస్తారు. ఆ తలుపు ఉండే ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా సీలు వేసిన స్ట్రాంగ్ రూమ్ ను తిరిగి కౌంటింగ్ రోజున మాత్రమే అందరి సమక్షంలో తెరుస్తారు. మూసివేసే సమయంలోనూ, తిరిగి తెరిచే సమయంలోనూ వీడియోగ్రఫీ చేస్తారు. బ్యాటరీ ఆఫ్ చేయకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. కంట్రోలు యూనిట్ వాడుకునే కరెంట్ అతి తక్కువ. కంట్రోలు యూనిట్ లో ఓటును అలాట్ చెయ్యగలం అంతే. బ్యాలెట్ యూనిట్ లో ఓటు వినియోగం తరువాతే మరోసారి కంట్రోలు యూనిట్ పని చేసేందుకు సిద్ధం అవుతుంది. ఎప్పుడైతే కంట్రోలు యూనిట్, బ్యాలెట్ యూనిట్ ల మధ్య ఉన్న కేబుల్స్ తొలగించగానే రెండు కూడా ఏ రకమైన చర్యలు చేయడానికి వీలులేకుండా ఉండిపోతాయి. అందువల్ల ఒక్క ఓటు కూడా పోలింగ్ స్టేషన్ బయట వేసేందుకు వీలులేదు.ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఎన్ని ఓట్లు పోలైనాయో ఉంటుంది. ఏజెంట్లు అక్కడ సంతకం చేస్తారు. ఆ ఓట్ల సంఖ్య ఫైనల్. ఆ పైన అదనంగా ఓట్లు కనిపించవు. అది అసాధ్యం. ఈవీయంలను మ్యానేజ్ చేసే విధానమే ఉంటే అధికారంలో ఉన్న పార్టీ పోటీదారులు వందశాతం గెలవాలి. అన్ని పోలింగ్ స్టేషన్లలో మెజారిటీ ఆ అధికార పార్టీకే రావాలి కదా... మరి అలా జరగటం లేదు కదా. ఫలితాలు తలకిందులై అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయి వేరే పార్టీలు యంయల్ఏ, యంపీ ఎలక్షన్ల ద్వారా రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తున్నాయి అంటే ఈవీయంలు చక్కగా పని చేస్తున్నాయనే కదా అర్ధం. ఇక్కడ మరో లాజిక్ కూడా చాలా మందికి పీకుతూనే ఉంది. ఒక వేళ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి నిజంగానే ఈవీఎంలను టాంపర్ చేసి గెలిచి ఉంటే.. మరి కేంద్రంలో బీజేపీ కూడా అఖండ మెజార్టీతో విజయం సాధించాలిగానీ.. 420 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే 240కి పరిమితం కావడమేంటన్నది మరి కొందరి ప్రశ్న. మరో మాట కూడా ఇదే విషయంలో రాసుకోవచ్చు. గతంలో ఏపీలో జగన్ మోహన రెడ్డి సైతం 151 సీట్ల అఖండ మెజార్టీతో గెలిచినపుడు బాబు ఇలాగే అన్నారు. ఇప్పుడు జగన్ పార్టీ ఆ వాయిస్ అందుకుంది. మరి 151 సీట్లు వచ్చినపుడు రాని ఈవీఎం డౌట్ ఇప్పుడే రావడంలో అర్దమేంటి. పెమ్మసాని వంటి వారి ముక్కూ మొహం ఓటర్లకు తెలీదంటున్నపుడు జగన్ హయాంలో గెలిచిన వారి ముక్కూ మొహం మాత్రం ఎవరికి తెలుసు? పెమ్మసాని అన్నా ఇంటర్నేషనల్ లెవల్లో బయో టెక్ బిజినెస్ చేసిన బిజినెస్ మెన్. మరి నందిగం సురేష్ వంటి వారు ఎంపీ అయినపుడు ఇదే ప్రశ్న వీరందరికీ ఎందుకు రాలేదు? ఇలా లాజిక్కులు లాక్కుంటూ పోతే.. తెగేది లేదు తెల్లవారేది లేదన్నది ఒక విశ్లేషణగా తెలుస్తోంది. మరి మీరేమంటారు???
http://www.teluguone.com/news/content/pemmasani-chandra-shekhar-39-203930.html





