ప్రియాంకకు పార్టీ పగ్గాలు.. కాంగ్రెస్ లో కానరాని ఆసక్తి

Publish Date:Aug 25, 2022

Advertisement

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కుంటే, పోయినదేదో దొరికే  అవకాశం అంతో ఇంతో ఉంటుంది. అంతే కానీ, ఎక్కడో పారేసుకుని ఇంకెక్కడో వెతుక్కుంటే ఫలితం ఉండదు సరి కదా, ప్రయాస మిగులుతుంది. ఇప్పుడు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అచ్చం అలాగే, వుంది. నిజమే, కాంగ్రెస్ పార్టీకి గాంధీ నెహ్రూకుటుంబం ఒక అసెట్., అలాగే ఒక లయబిలిటీ కూడా. అందుకే, కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత రెండూ నెహ్రూ గాంధీ కుటుంబమే, అనే నానుడి ఒకటి బలంగా నాటుకు పోయింది. 

కానీ, అదంతా గతం, ఇప్పుడు పరిస్థితి అది కాదు. నడుస్తున్న చరిత్రలో జరుగుతన్న పరిణామాలను గమనిస్తే, నెహ్రూ గాంధీ కుటుంబం బలం కంటే, బలహీనతే బలంగా కనిపిస్తోంది. ఎవరు అవునన్నా, ఎవరు  కాదన్నా, సోనియా గాంధీ చాలా వరకు కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయారు. పార్టీ మీద పట్టును నిలుపుకున్నారు. పడిలేచిన కెరటంలాగా, పదేళ్ళ విరామం తర్వాత అయినా, 2014లో కాంగ్రెస్ సారధ్యంలో సంకీర్ణ (యూపీఏ) ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమికను పోషించారు. అలాగే, తిరిగి 2009 మరో మారు కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, 2014లో సోనియా, రాహుల్ గాంధీ సారధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది. అధికారం కోల్పోయింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లోక్ సభలో పార్టీ బలం రెండంకెల (52) స్థాయికి పడిపోయింది. తిరిగి 2019లో తొలిసారిగా, రాహుల్ గాంధీ సారధ్యంలో అదే స్థాయిలో ఓడిపోయింది.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్ళు పూర్తవుతున్నాయి. ఈ నేపధ్యంలో మళ్ళీ మరోమారు కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం అందుకోగలదా? అంటే, అనుమానం లేకుండా అయ్యే పనికాదనే సమాధానమే వస్తోంది. నిజమే, ప్రస్తుతం తిరుగులేదన్నట్లు వెలిగి పోతున్న బీజేపీ వెలుగులు రేపటి 2024 ఎన్నికల్లోనూ, కాదంటే ఆ తర్వాత ఐదేళ్లకు వచ్చే, 2029 ఎన్నికల్లో కనుమరుగైతే కావచ్చును.కానీ, ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుందా? చేయగలదా ? అంటే, నెహ్రూ గాంధీ కుటుంబ సారధ్యంలో అది అయ్యే పని కాదనే   సమాధానమే వస్తోంది. 

ఃనెహ్రూ నుంచి సోనియా గాంధీ వరకు, కాంగ్రెస్ పార్టీకి  ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఉపద్రవాలు ఎదురైనా నెహ్రూ గాంధీ కుటుంబం పార్టీని కాపాడుతూ వచ్చింది. ముఖ్యంగా ఇందిరా గాంధీ, ఒకటికి రెండు సార్లు నిట్టనిలువునా చీలినా పార్టీ మీద పట్టును నిలుపుకుంటూ వచ్చాను. చీలిక వర్గాలు కాలగతిలో కలిసిపోయాయి. ఇందిరాగాంధీ తర్వాత, రాజీవ్ గాంధీ, సోనియ గాంధీ  ప్రత్యక్షంగా కాకుంటే  పరోక్షంగానే అయినా  పార్టీ మీద పట్టును నిలుపు కుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు, సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ తిరిగి కోలుకోవడం అయ్యే పని కాదని, అందరూ అంగీకరిస్తున్నారు.

ఓ వంక వరస ఓటములు పార్టీని వెంటాడుతుంటే, మరో వంక తరతరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పార్టీ వదిలి పోతున్నారు. అలాగే, ఇంతకు  ముందు ఎప్పుడు లేని స్థాయిలో పార్టీలో అసమ్మతి రగులుతోంది. ఏకంగా 23 మంది పార్టీ సీనియర్ నేతలు, జీ 23 పేరిట ఒక అసమ్మతి వేదికను ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా ఉన్నగులాం నబీ ఆజాద్,ఆనంద్’శర్మవంటి వంటి సీనియర్ నాయకులు పార్టీ పదవులు ఇస్తామన్నా వద్దంటున్నారు. సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితులు పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్ లో  కోలుకోవడం, మళ్ళీ మరో మారు అధికారంలో భాగస్వామి కావడం కాని పనిగానే పరిశీలకులు భావిస్తున్నారు.  

అదొకటి అలా ఉంటే రాహుల గాంధీ కాదంటే, ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రతిపాదన విషయంలోనూ పార్టీలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని అంటున్నారు. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లుగా, ప్రియాంక పేరు తెర మీదకు వచ్చినా ఫలితమ ఉండదని అంటున్నారు. అందుకే, రాహుల్ గాంధీ చెప్పినట్లుగా పార్టీ అధ్యక్ష పదవిని గాంధీ నెహ్రూ కుటుంబం బయటి వారికి ఇవ్వడమే ఉత్తమమని, పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.