రేవంత్‌రెడ్డి దెబ్బ‌తో కేసీఆర్‌కు మైండ్‌బ్లాంక్‌!.. గులాబీబాస్‌కు టీడీపీ రిట‌ర్న్ గిఫ్ట్‌..

Publish Date:Jul 3, 2021

Advertisement

రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ప్ర‌క‌టించ‌గానే కాంగ్రెస్ శ్రేణులు పండ‌గ చేస్కుంటున్నాయి. ఊరూ-వాడ సంబ‌రాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కోలాహ‌లం నెల‌కొన‌గా.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మాత్రం అంతా నిశ‌బ్దం. జై రేవంతన్న నినాదాలు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌ల్లో రీసౌండ్ అవుతున్నాయ‌ట‌. గ‌జ్వేల్ ఫామ్‌హౌజ్‌లోనూ ప్ర‌కంప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ట‌. కొన్నిరోజులుగా కేసీఆర్‌లో ఉలిక్కిపాటు మొద‌లైంద‌ట‌. బీజీ రైజ్ అయింద‌ట‌. చిటికీమాటికీ కోసం తెచ్చుకుంటున్నార‌ట‌. గ‌ట్టిగా అరుస్తున్నార‌ట‌. క‌రుస్తున్నార‌ట‌. స‌రిగా నిద్ర కూడా పోవ‌డం లేద‌ట‌. ఇందులో నిజ‌మెంతో గానీ.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డం మాత్రం కేసీఆర్‌కు మింగుడుప‌డ‌ని అంశ‌మే. రేవంత్‌ పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా త‌న కోవ‌ర్టుల‌తో ఎంత‌గా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించినా.. ఆ ప‌ని గులాబీ బాస్‌ వ‌ల్ల కాలేద‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ ప‌గ్గాలు చేత‌బట్టి.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మైపోయారు. రేవంత్ కేక‌తో.. కేసీఆర్‌లో కాక పెరుగుతోంద‌ట‌. ఇంత‌కీ, గులాబీ బాస్ అంత‌లా టెన్ష‌న్ ప‌డ‌టానికి కార‌ణం ఏంటి? రేవంత్‌రెడ్డితో ఆయ‌న‌కు గానీ, టీఆర్ఎస్‌కుగానీ జ‌రిగే న‌ష్ట‌మేంటి?

ల‌క్ష‌లాది సైన్యం ఉన్నా.. ఒక్క స‌మ‌ర్థుడైన నాయ‌కుడు లేక‌పోతే యుద్ధంలో గెలుపు అసాధ్యం. ఏడేళ్లుగా కాంగ్రెస్ ప‌రిస్థితి అదే. నాయ‌కుడైతే ఉన్నాడు కానీ.. కేసీఆర్‌ను ఢీకొట్ట‌గ‌ల ద‌మ్మున్న లీడ‌ర్ కొర‌త ఆ పార్టీని తీవ్రంగా వేధించింది. మూడున్న‌రేళ్ల‌ క్రితం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డంతో హ‌స్తంపార్టీకి వెయ్యేనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్టైంది. నేడు ఆయ‌న‌కు ఏకంగా పీసీపీ కిరిట‌మే ద‌క్క‌డంతో.. ఇక కేసీఆర్‌కు ద‌బిడి దిబిడే అంటున్నారు.   

టీఆర్ఎస్‌లో ఇప్పుడున్న నాయ‌కుల్లో చాలామంది ఒక‌ప్ప‌టి టీడీపీ నేత‌లే. తెలంగాణ‌లో టీడీపీ ప్ర‌భ మ‌స‌క‌బార‌డంతో.. ఓ వెలుగువెలిగిన లీడ‌ర్ల‌ను సైకిల్ మీద నుంచి దింపేసి.. కారెక్కించుకున్నారు కేసీఆర్‌. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న అప్ప‌టి టీడీపీ నాయ‌కుల‌కు రేవంత్‌రెడ్డి ప‌నిత‌నం, సామ‌ర్థ్యం బాగా తెలుసు. ఇదే ఇప్పుడు కేసీఆర్‌లో క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణం అంటున్నారు. ఒక‌నాడు కేసీఆర్‌ను న‌మ్మి టీడీపీతో స‌హా వివిధ పార్టీల్లోని నేత‌లంతా ఎలాగైతే టీఆర్ఎస్‌లో చేరారో.. ఇప్పుడు అదే ఫార్ములా ప్ర‌కారం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంపై గురితో.. టీఆర్ఎస్‌లోని సంతృప్త‌, అసంతృప్తి నాయ‌కులంతా తాజాగా రేవంత్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ఎప్ప‌టికైనా సీఎం అవుతార‌నే అంచ‌నాతో.. ఇప్పుడే ఆయ‌న వెంట న‌డిస్తే.. రేపొద్దున్న అధికారంలోకి వ‌స్తే.. త‌మ‌ను గుర్తుపెట్టుకొని మంచి ప‌ద‌వి ఇస్తార‌నే ఆశ‌తోనైనా ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నార‌ట‌. త‌మ‌ ఫోన్లు ట్రాప్ అవుతున్నాయ‌నే అనుమానంతో.. ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు రేవంత్‌రెడ్డికి ఇప్ప‌టికే వాట్సాప్ కాల్స్ చేసి విషెష్ చెప్పార‌ని అంటున్నారు. పాత టీడీపీతో పాటు కొత్త టీఆర్ఎస్ నేత‌లు సైతం తాజాగా రేవంత్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని స‌మాచారం. 

అటు, తెలంగాణ రెడ్ల‌తో పాటు హైద‌రాబాద్‌లో ఉండే సీమ రెడ్లు, వివిధ వ‌ర్గాల సీమాంధ్ర ప్ర‌జ‌లు సైతం రేవంత్‌రెడ్డికే అనుకూలంగా ఉన్నార‌నే టాక్ ఉంది. ఇటీవ‌లి జీహెచ్ఎమ్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ బొటాబొటి మెజార్టీతో గెలిచి బ‌య‌ట‌ప‌డ‌టానికి సెటిల‌ర్స్ ఓట్లే కార‌ణం. స్థానికులు అధికంగా ఉండే డివిజ‌న్ల‌లో బీజేపీ గెలిస్తే.. సీమాంధ్ర ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న‌ చోట్ల కారు పార్టీ దూసుకుపోయింది. రేవంత్‌రెడ్డి రాక‌తో ఈ ఈక్వేష‌న్ మారిపోతోంది. ఇటీవ‌ల రెండు రాష్ట్రాల జ‌ల వివాదం, ఏపీ ప్ర‌జ‌ల‌ను రాక్ష‌సులంటూ మంత్రులు తిట్ట‌డంతో.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు ఆవేశంతో ర‌గిలిపోతున్నారు. వారంతా కేసీఆర్‌కు అగెనెస్ట్‌గా రేవంత్‌రెడ్డి వైపు షిఫ్ట్ అవుతున్నారు. గ్రేట‌ర్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లోనూ టీడీపీకి ఇప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ ఓటు బ్యాంకు ఉంది. బీసీల పార్టీగా పేరున్న టీడీపీ అభిమానులు తెలంగాణ‌లో ఊరూరా ఉన్నారు. చంద్ర‌బాబు అందించిన ఐటీ ఫ‌లాలు ఆర‌గిస్తున్న వారంతా ఇప్ప‌టికీ సీబీఎన్‌కు రుణ‌ప‌డే ఉన్నామంటారు. వారంతా.. ఇప్పుడు ఒక‌ప్ప‌టి టీడీపీ నాయ‌కుడైన రేవంత్‌రెడ్డికి స‌పోర్ట‌ర్స్‌గా మారుతున్నారు. టీటీడీపీని తీవ్రంగా డ్యామేజ్ చేసిన కేసీఆర్‌కు.. నాయ‌కులు, ఓట‌ర్లు క‌లిసి రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇక‌, రేవంత్‌రెడ్డికి రెడ్ల స‌పోర్ట్ ఫుల్‌గా ఉంది. అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి నాయ‌కులు రేవంత్‌రెడ్డిని త‌మ‌వాడిగానే భావిస్తున్నారు. ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా స‌హ‌క‌రించేందుకు సిద్ధ‌మైపోయారు. టీఆర్ఎస్‌కే రెడ్డి షాక్ గ‌ట్టిగా త‌గల‌నుంది. కేసీఆర్‌పై ఎప్ప‌టినుంచో గుర్రుగా ఉన్నారు రెడ్డి నాయ‌కులు. త‌మ‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేదంటూ చాలాకాలంగా అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వానికి జై కొట్టేందుకు ఆలోచ‌న చేస్తున్నారు. తెలంగాణ‌లో గ్రామాల‌కు గ్రామాల‌నే ప్ర‌భావితం చేయ‌గ‌ల రెడ్డి నాయ‌కులంతా ఏక‌మై రేవంత్‌రెడ్డికి మ‌ద్ద‌తిస్తే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు భారీ గండి ప‌డ‌క త‌ప్ప‌దు. మ‌రోవైపు, సీమాంధ్ర ప్ర‌జ‌లు, టీడీపీ అభిమానులు అంతా మూకుమ్మ‌డిగా రేవంత్‌రెడ్డికే స‌పోర్ట్ చేస్తుండ‌టంతో.. కేసీఆర్‌కు కంటి మీద కునుకు క‌రువైంద‌ని చెబుతున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే ఇంటెలిజెన్స్ రిపోర్టు ముఖ్య‌మంత్రికి చేరింద‌ని.. అ నివేదిక చూశాక గులాబీ బాస్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింద‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డి దెబ్బా.. మ‌జాకా....
 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.