పవన్ ది రాజకీయ అవగాహనా రాహిత్యం.. సీపీఎం

Publish Date:Jun 6, 2026

Advertisement

కమ్యూనిస్టులపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ చేసిన వాఖ్యలను సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి  శ్రీనివాసరావు తప్పుపట్టారు.  విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో  జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న పనికిరాని పాత చింతకాయ పచ్చడినే పవన్ కల్యాణ్‌ మరోమారు వండి వార్చారని, ఆ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ అపరిపక్వతకు నిదర్శనమన్నారు.

 పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు.   ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు   అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి వరకు చేగువేరా, భగత్‌సింగ్ ఆదర్శాల గురించి చెప్పిన ఆయన నేడు కమ్యూనిజమే కాలం చెల్లిన సిద్ధాంతమంటున్నారని ఎద్దేవా చేశారు.  

గతంలో కమ్యూనిస్టులతో పనిచేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత బిజెపి సరసన చేరి సనాతన ధర్మం గురించి   హడావుడి చేశారనీ.. ఇప్పుడేమో.. ఆంధ్ర ప్రజల్లో ప్రాంతీయ అభిమానం కూడా లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారనీ, ఇలా రోజుకో మాట, పూటకో విధానాన్ని మార్చే ఆయన కమ్యూనిజం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వీశ్రీనివాసరావు విమర్శించారు.  మతతత్వ బిజెపితోచేరి యువతలో వస్తున్న మార్పుల్ని పవన్ కల్యాణ్ గుర్తించడం లేదని వీశ్రీనివాసరావు అన్నారు. 

By
en-us Political News

  
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.