పవన్ పై చిరంజీవి స్పందన, తెలంగాణ పైనా
Publish Date:Oct 29, 2012
Advertisement
కేంద్ర మంత్రి గా చిరంజీవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన హాజరైయ్యారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం పై చిరంజీవి స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రతి చోట ఉండాలంటే ఎలా? అతను షూటింగులో బిజీగా ఉండటం వల్లనే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేక పోయారన్నారు. ప్రతి కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అందరూ ఉండాలంటే కష్టం అని అన్నారు.
కేంద్ర మంత్రి పదవి దక్కడం పై ఆనందంగా ఉన్న చిరంజీవి, మీడియా ద్వారానే తనకు పర్యాటక శాఖ కేటాయించినట్లు తెలిసిందన్నారు. ఒక వేళ తనకు పర్యాటక శాఖ కేటాయిస్తే దేశంలోని పర్యాటక ప్రదేశాలను మెరుగుపరుస్తానని చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. భారత పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చిరంజీవి అన్నారు. 29వ తేదీన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. తెలంగాణ అంశంపై అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చిరంజీవి తెలిపారు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని అన్నారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-chiranjeevi-31-18643.html





