వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు.. ఏది నిజం.. ఏది అబద్దం?

Publish Date:Jul 11, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరో బర్నింగ్ అంశం నడుస్తున్నది. రెండో విడత వారాహీ విజయయాత్ర మొదలు పెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్   వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏలూరులో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ఇప్పటికి 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఉండే వాలంటీర్లు ఎవరు ఎవరి మనిషి.. ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? ఆడపిల్లలు ఎవరైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతువులు ఉన్నారా అనే విషయాలను సేకరించి.. ఆ సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

వాలంటీర్లపై ఇంతటి స్థాయి ఆరోపణలు చేసిన పవన్ ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని, దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని చేసిన  వ్యాఖ్యలు ఇటు వాలంటీర్లలో, అటు వైసీపీలో తీవ్ర కలకలం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించారు. తమపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని   డిమాండ్ చేశారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని తగిన ఆధారాలను చూపించాలని నోటీసులు పంపింది.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. వాలంటీర్లు, వైసీపీ నేతలు, మహిళా కమిషన్ స్పందన ఎలా ఉన్నా అసలు పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? వాలంటీర్ వ్యవస్థకు ఉన్న నిబద్దత ఎంత? అన్నదానిపై ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల వద్ద నిజంగానే ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు.. వారేం చేస్తారు.. ఆదాయం ఎంత.. కులం ఏంటి? యువతీ యువకులు ఎంతమంది? వారేం చదువుతున్నారు? ఎక్కడ ఉన్నారు? ఇంట్లో వితంతువులు ఉన్నారా? వారికి ఆదాయం ఉందా? ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నారు? ఆస్తులు, అప్పులు, బ్యాంక్ వివరాలు, గర్భవతులు ఎవరు? ఇలా ఒక్కటేమిటీ ప్రతి మనిషికి సంబంధించిన ప్రతి సమాచారం ఒక్క క్లిక్ తో వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది. మరి ఈ ప్రజల వ్యక్తిగత సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వం భద్రత కల్పించిందా? అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు కావాలని అడిగే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో వాలంటీర్ల వద్ద సమాచారానికి మేము కల్పించిన భద్రత ఇదని ప్రభుత్వం ముందుగా చెప్పాలి.

 ఇక పవన్ కల్యాణ్ వాలంటీర్లు టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలను చూస్తే.. వాలంటీర్లపై ఈ నాలుగేళ్ళలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల నుండి ప్రభుత్వ పథకాల వరకూ వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్నది అక్షరాలా నిజం. ఎందుకంటే దాదాపుగా వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే. ఈ మాట వైసీపీ నేతలే బహిరంగంగానే చెప్పేశారు. ఆ కారణంగానే పవన్ అంత పెద్ద ఆరోపణ చేయగలిగారు. ఇక పవన్ వ్యాఖ్యల వెనక మరో కారణం వైసీపీని రెచ్చగొట్టడంగా కనిపిస్తుంది. వారాహీ తొలి విడత యాత్రతో జనసేనలో జోష్ కనిపించింది. అయితే, పవన్ చేసిన ఆరోపణలకు మాత్రం వైసీపీ నుండి సమాధానం రాలేదు. పైగా పవన్ వ్యక్తిగత జీవితంపై మాత్రమే వైసీపీ దాడి చేసింది. అందుకే పవన్ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. పవన్ అనుకున్నట్లుగానే వైసీపీ నుండి, ప్రభుత్వం నుండి జెట్ స్పీడ్ లో రెస్పాన్స్ వచ్చింది. పవన్ యాత్రకి ఫుల్ పబ్లిసిటీ కూడా వచ్చేసింది. మరి ఈ అంశం ఎంతవరకు వెళ్తుందో.. ఎవరికి మేలు చేస్తుందో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.