Publish Date:May 21, 2022
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పొత్తుల ఆవశ్యకతపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఈ విషయాన్ని జనసేన వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలన్న సంకేతాలూ పార్టీ అధినేత నంచి వచ్చేశాయని వారు చెబుతున్నారు. అయితే అదే సమయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర నాయకులపై జనసేనాని అసహనంతో ఉన్నరని కూడా వారు చెబుతున్నారు. బీజేపీ ఏపీ నాయకులు జగన్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అందుకే వారి వ్యాఖ్యలు, ప్రకటనలకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వొదని కూడా పార్టీ కేడర్ కు ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారని చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక వైపు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తూనే మరో వైపు పొత్తుల విషయంలో అయోమయాన్ని సృష్టిం చే ప్రకటనలు చేయడం ద్వారా జగన్ కు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తల విషయంపై నిర్ణయం తీసుకోవలసింది బీజేపీ జాతీయ నాయకత్వం కానీ, ఇక్కడి నాయకులు కాదని ఆయన చెబుతున్నారు.
బీజేపీ రాష్ట్ర నేతలు ఒక వైపు పవన్ కల్యాణ్ పార్టీతో బీజేపీకి పొత్తు ఉందని చెబుతూనే.. మరో వైపు తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రశక్తే లేదంటూ చేస్తున్న ప్రకటనలు ఓట్ల చీలికకు కారణమయ్యేలా ఉన్నాయని, అందుకే పవన్ కల్యాణ్ ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానంతోనే తేల్చుకోవాల్సిన అవసరం ఉందని జనసేనాని భావిస్తున్నారు. ఓట్లు చీలనివ్వబోమన్న ప్రకటనతోనే తన ఉద్దేశమేమిటన్నది పవన్ కల్యాణ్ విస్పష్టంగా చెప్పేశారనీ, దానిపై జనసేనలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేకపోవడమే కాకుండా.. తెలుగుదేశంతో పొత్తు అనగానే జనసైనికులలో ఉత్సాహం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అధికారిక ప్రకటన లేకుండానే జనసైనికులు క్షేత్ర స్థాయిలో తెలుగుదేశంతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీస ఉనికి లేని బీజేపీ, కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రకటనలతో జగన్ కు మేలు చేసేలా వ్యవహరించడాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ అన్నట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ వల్ల రాష్ట్రంలో జనసేనకు కానీ, తెలుగుదేశంకు కానీ వీసమెత్తు ప్రయోజనం లేదనీ, పైగా ఆ పార్టీని కలుపుకు పోవడం వల్ల మైనారిటీ ఓట్లు దూరం అయ్యే అవకాశం ఉందనీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-clarity-on-alliance-dissatisfaction-on-ap-bjp-25-136223.html
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.