ఖజానా ఖాళీ.. సాయం అందే దారి లేదు.. పాక్ కింకర్తవ్యం!

Publish Date:May 10, 2025

Advertisement

భారత్‌ను కెలికి  పాక్ అన్నిరకాలుగా చావుదెబ్బ తింటోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్‌ ఏజన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్‌కు ఏ మాత్రం లేదు. పాకిస్తాన్ ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోలు వరకూ అనేక నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధార పడే ఆ దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా అవసరం. అవిప్పుడు పూర్తిగా నిండుకున్నాయి. ప్రస్తుతమున్న నిల్వలు మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపో తాయంటున్నారు. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాలి. కానీ పాక్‌ను ఆర్థికంగా ఆదుకోవటానికి  ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక వివరాలు అందించే  సీఈఐసీ ప్రకారం... డిసెంబరు 2024 నాటికి పాకిస్థాన్‌ అప్పు 131 బిలియన్‌ డాలర్లు.  తాజాగా పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మరోసారి సహాయం కోసం చేయి చాచింది.

పాక్‌ జీడీపీలో అప్పుల వాటా ఇప్పటికే 75 శాతానికి చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచదేశాల్లో ముద్ర పడింది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం వంటి సామాజిక సమస్యలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడమే కష్టమైన తరుణంలో యుద్ధ సన్నాహాలు పాక్‌కు అసాధ్యంగా మారనున్నాయి. మరో వైపు బయట నుంచి నిధులు వచ్చే మార్గాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు కొండలా పేరుకుపోవడంతో వాటిని తీర్చేందుకు సతమతమవుతున్న దాయాది దేశం.. యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి లేదు. పరిమిత ఘర్షణలతో కూడిన సైనిక ప్రతిష్టంభన సైతం పాకిస్థాన్‌కు అంతులేని నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళుతున్న భారత్‌తో యుద్ధం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అటు ఆర్థిక ఇబ్బందులకు తోడు... రాజకీయంగా, సామాజికంగా కూడా పాక్‌లో పరిస్థితి అదుపు తప్పుతోంది. బలూచిస్థాన్‌లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం ప్రభుత్వానికే కాదు, సైన్యానికీ సవాలు విసురుతోంది.  తరచూ జరుగుతున్న దాడులతో అక్కడ అదనపు బలగాలను మోహరించాల్సిన అనివార్య పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని అక్కడ వెచ్చిస్తోంది. ఇటీవల జరిగిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌తో ఆ ప్రాంతంపై పాకిస్థాన్ పట్టు కోల్పోయినట్లయింది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వంతోనూ పాక్‌కు పొసగటం లేదు. ఇంకోవైపు సింధ్‌లో ఇండస్‌ నదిపై కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒక రకంగా పాకిస్థాన్ అంతర్యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్నది.  

దేశ భద్రతలో కీలకమైన రక్షణవ్యవస్థ కూడా బలోపేతంగా ఏమీ లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యంపైనా పడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కిరోసిన్, పెట్రోలు వంటి వాటినీ అవసరాలకు అందించలేకపోతున్నారు. అరకొర సౌకర్యాలతో భారత్‌ వంటి శక్తిమంతమైన దేశాన్ని ఎక్కువ రోజులు ఎదుర్కోలేమని పాక్‌ రక్షణ నిపుణులు తేల్చి చెబుతున్నారు. 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్‌ రూ.2.50 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని... పాకిస్థాన్‌ కూడా ఇదే స్థాయిలో ఆర్థిక వనరులు వినియోగించాల్సి ఉంటుందని ముంబయికి చెందిన థింక్‌ ట్యాంక్‌ స్ట్రాటజిక్‌ ఫోర్‌సైట్‌ గ్రూప్‌ విశ్లేషించింది. ఇదే జరిగితే పాక్‌పై కోలుకోలేని భారం పడుతుంది. ఆ దేశంలో ప్రజాజీవనం స్తంభిం చిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.