ఆప‌రేష‌న్ సిందూర్.. మ‌న ఆయుధ మార్కెట్ అ‘ధర’ హో!

Publish Date:May 13, 2025

Advertisement

భార‌త్ ఆయుధాలు పరీక్షకు నిలబడ్డాయా? 
భార‌త్ ఆయుధాలు కూడా   మార్కెట్లోకి ప్ర‌వేశించిన‌ట్టేగా?
ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా  మ‌రో ఆయుధ లాభ‌మేంటి? 

ఇన్నాళ్ల పాటు మ‌న ఆయుధాలు.. ఎక్క‌డో గోదాముల్లో మాత్ర‌మే ఉండేవి. అప్పుడ‌ప్పుడూ వాటి ప‌రీక్షల స‌మ‌యంలో  మాత్రం సినిమాలలో ఐటెం సాంగ్ లా మన ఆయుధాలు కూడా ఐటెం కింద వార్తల్లో నిలిచేవి. ఎంత పెద్ద బ్ర‌హ్మోస్ క్షిప‌ణి వార్త గురించైనా స‌రే స్పీడ్ న్యూస్ లో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవి. ఇప్పుడ‌లా కాదు.. మ‌న బ్ర‌హ్మోస్ ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ హెడ్ లైన్.  మ‌న ఆకాష్ ఒక పవర్ ఫుల్ క‌వ‌ర్ ప్యాకేజ్.  ఇక మ‌న స్కై  స్ట్రైక‌ర్, నాగాస్త్ర‌- 1 వంట‌టివి నాన్ స్టాప్ న్యూస్ క‌వ‌రేజ్.  వీటికి ర‌ష్య‌న్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ కి ఫుల్ ఫాలోయింగ్. రాఫెల్ కి కూడా కావాల్సినంత ఇమేజ్..

స‌రే ర‌ష్య‌న్ ఎస్ 400 హండ్రెడ్స్, ఫ్రెంచ్ రాఫెల్స్ అంటే అది మన స్వ‌దేశీ ప‌రిజ్ఞానం  కాదు. అదే బ్ర‌హ్మోస్ అలాక్కాదే. అది పాకిస్థాన్ గుండెల్లో మోగించిన అణుబాంబులు అంత మామూలు విష‌యం కాదు. భార‌త అమ్ముల పొదిలో దాగిన బ్ర‌హ్మాస్త్రం. స్వ‌యానా మ‌నం త‌యారు చేసిన అద్భుత‌మైన ఆయుధం. ఇదెంత వ‌ర‌కూ పేలిందో పేల్లేదో తెలియాలంటే ఈ విష‌యం గురించి మ‌నం భార‌తీయుల‌ను కాదు అడ‌గాల్సింది పాకిస్తానీ నేష‌న‌ల్ క‌మాండ్ మీటింగ్ కి హాజ‌రైన వారిని అడ‌గాలి. ఎందుకంటే వారేగా ఇది నూర్ ఖాన్ వైమానిక స్థావ‌రం ద‌గ్గ‌ర ప‌డ్డంతో ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఎందుకంటే ఇక్క‌డికి ద‌గ్గ‌ర్లోనే  క‌ర్ణీ కొండ‌లుంటాయి. వాటి ప‌క్క‌నే 170 పాక్ మేడ్ అణ్వాయుధాల నిల్వ‌లుంటాయి.

మ‌న బ్ర‌హ్మోస్ వారి అణు నిల్వ‌ల ప‌క్క‌న ప‌డ్డందుకే పాకిస్థాన్ అంత‌గా ఉలిక్కి ప‌డి వెంట‌నే యూఎస్ కి సంకేతాలిచ్చింద‌ని చెబుతారు. ఆ త‌ర్వాత అమెరికా  జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హా దారు మార్క్ ఆంటోనీ రూబెన్స్, ఇక మ‌న ఇంటి అల్లుడు జేడీ వాన్స్ రంగంలోకి దిగ‌డం ఆ న‌ల‌భై ఎనిమిది గంట‌ల పాటు భార‌త్ పాక్ మిల‌ట‌రీ ఇత‌ర విదేశాంగ అధికారుల‌తో మాట్లాడ్డం చ‌క‌చ‌క జ‌రిగాయ్. ఆల్ క్రెడిట్స్ గోస్ టూ బ్ర‌హ్మోస్. మ‌న బ్ర‌హ్సోస్ ఆపిన యుద్ధ‌మిది.

అప్ప‌టి వ‌ర‌కూ ఇంట‌ర్నేష‌నల్ మీడియాను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది చైనా మార్క్ పీఎల్ 15. ఇది శాటిలైట్ క‌మ్ ఏఐ ఆప‌రేటెడ్ సైలెన్స్ వెప‌న్ అనీ.. దీన్నుంచి మ‌న రాఫెల్స్ ఎంత మాత్రం త‌ప్పించుకోలేవ‌ని ఓ ఊద‌ర‌గొట్టేవారు. దీంతో చైనా పీఎల్ 15 కి విశేష మైన ఆధ‌ర‌ణ ల‌భిస్తోన్న వేళ‌.. మ‌న వాళ్లు తెలివిగా మే 10 వ తేదీన మ‌న బ్ర‌హ్మోస్ ని క‌ర్ణీ  కొండ‌లకు ద‌గ్గ‌ర‌గా  ప్ర‌యోగించ‌డంతో.. గేమ్ ఛేంజ‌ర్ గా నిలిచింది. అందుకే ఈ బ్ర‌హ్మోస్ కి ఆప‌రేష‌న్ సిందూర్ లో కాల్పుల విర‌మ‌ణ‌ను ఆపిన గొప్ప పేరొచ్చింది. బ్ర‌హ్మోస్ ఎంత హిట్ అంటే ఆర్మేనియా 6 వేల కోట్ల‌కు మ‌నకు ఆర్డ‌రిచ్చింది. ఇండోనేసియా వంటి దేశాలు సైతం ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాయ్.

ఇక మ‌న ఆకాశ్ అయితే ఈ స‌రికే.. 23 వేల కోట్ల విలువైన ఆర్డ‌ర్ ప‌ట్టేసింది. ఇది గ‌తంతో పోలిస్లే 12 శాతంక‌న్నా   ఎక్కువ‌. దీని ఫ్యాన్ ఫాలోయింగ్ అంత మామూలుగా లేదు. పాక్ వాడిన ట‌ర్కిష్ డ్రోన్ దాడుల‌ను ఎదుర్కోవడంలో మ‌న ఆకాశ్ ప‌నితీరుకు విశేషమైన ప్ర‌శంస‌లు ల‌భించాయి. 1980లో భార‌త ప్ర‌భుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవ‌లప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రూపుదిద్దుకుంటూ వ‌చ్చినది ఆకాశ్. ఇది శ‌తృ విమానాలు, డ్రోన్లు, చాప‌ర్ల‌ను ఇట్టే ఢీ కొట్ట‌గ‌ల‌దు. దీన్ని మ‌న డీఆర్డీవో, బీఈఎల్, బీడీఎల్ సంయుక్త నిర్వ‌హ‌ణ‌లో త‌యారు చేశారు.

వీటితో పాటు.. మ‌న యాంటీ డ్రోన్ ఫోర్ డీ సిస్ట‌మ్ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కింద భార‌త్ త‌యారీ చేసిన స్వ‌దేశీ ప‌రిజ్ఞాన‌పు మ‌చ్చు తున‌క‌ల్లో ఇది కూడా ఒక‌టి.  పాక్ వాడిన ట‌ర్కిష్ డ్రోన్ల‌ను  గ‌ట్టిగా దెబ్బ తీసిన ఆయుధాల్లో ఇదే అత్యంత వేగంగా ఖ‌చ్చితంగా ప‌ని చేసింది. ఇది డీఆర్డీవో ద్వారా డెవ‌ల‌ప్ చేయ‌బ‌డి బీడీఎల్ త‌యారీ. దీని కెపాసిటీ మొత్తం ఈ ఆప‌రేష‌న్ సిందూర్ లో వెలుగులోకి వ‌చ్చింది.

ఇక నాగాస్త్ర 1 సంగ‌తి స‌రే స‌రి. ఇది ఎలాంటిదంటే ఆత్మాహుతి డ్రోన్ సంత‌త‌కి చెందిన‌ది. టార్గెట్ దొరికే వ‌ర‌కూ ఆ ప్రాంతంలో అలాగే నిలిచి.. త‌ర్వాత.. దూసుకుపోగ‌ల‌దు. ఇది ఏక‌కాలంలో టార్గెట్ ఛేజింగ్ దాని ధ్వంసం రెండూ చేయ‌ల నాగాస్త్రం. ఇలా దీని ప్ర‌త్యేక‌త‌లు చాలానే. ఈ ఆప‌రేష‌న్  సిందూర్ లో ఇలాంటి ఆయుధాలు ఉంటాయ‌ని కూడా తెలియ‌ని వారికి వీటి విలువ ఏమిటో తెలియ వ‌చ్చింది. స్కై స్ట్రైక‌ర్స్. ఇది మ‌న బెంగ‌ళూరులో త‌యారైనది. ఇందులో ఇజ్రాయెల్ టెక్నాల‌జీ వాడాం.  ఇది భార‌త్ ఇజ్రాయెలీ జాయింట్ వెంచ‌ర్. అలాంటి ఇది కూడా ఆప‌రేష‌న్ సిందూర్ లో త‌న ప‌ని త‌నం చూపించి భార‌త్ ఆయుధ మార్కెట్ విలువ అమాతం పెంచేసింది.

ఇప్పుడు ప‌లు దేశాలు భార‌త్ కి సంబంధించిన ఆయుధాల‌ను మేం కొంటామంటే మేం కొంటామంటూ ఎగ‌బ‌డుతున్నారు. కార‌ణం ఏంటంటే ఒక ర‌ష్యా, యూఎస్, ఫ్రెంచ్ వంటి దేశాల నుంచి ఆయుధాల కొనుగోలు అంటే అదేమంత మాములు విష‌యం కాదు. అదే భార‌త్ ఇటు సినిమాలు, అటు శాటిలైట్ల‌తో పాటు.. ఆయుధాల త‌యారీలోనూ స్వ‌దేశీ ప‌రిజ్ఞానం వాడి.. అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే అమ్మే కెపాసిటీ  సొంతం చేసుకుంది.. దీంతో మ‌న ఆయుధ మార్కెట్ అ..ధ‌ర‌హో! అంటోంది..

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.