Publish Date:Sep 18, 2024
దేశంలో కేంద్రానికి, రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి (జమిలి) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వన్ నేషన్ -వన్ ఎలక్షన్‌పై నియమించిన రామ్‌నాథ్ గోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశం మీద పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెడతారు. జమిలి ఎన్నికల నిర్వహణకు మోడీ ప్రభుత్వం పట్టుదలగా వుంది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ తదితర ప్రతిపక్షాలు అంటున్నప్పటికీ ఈ విషయంలో మోడీ సర్కార్ వెనుక అడుగు వేసే ఉద్దేశాన్ని ఏ దశలోనూ వ్యక్తం చేయలేదు. రెండు రోజుల క్రితం హోం శాఖ మంత్రి అమిత్ షా ఈసారి జమిలి ఎన్నికల నిర్వహణకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టంగా చెప్పారు.
పదేళ్ల క్రితం బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తూనే ఉంది. గత రెండు పర్యాయాలుసంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి సర్కార్‌ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జమిలి ఎన్నికలపై ఎంతమాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం. మొన్నటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి స్పష్టంగా చెప్పారు కూడా.
దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా మారింది. దేశంలో ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు నిర్వహిస్తూనే వుంటారు. ఇలా ఎన్నికల ప్రక్రియ నిరంతరం జరగడం వల్ల దాని ప్రభావం దేశ అభివృద్ధి మీద పడుతోందన్న అభిప్రాయాలున్నాయి. దీన్ని అధిగమించడానికి జమిలి ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్ల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, అలాగే, రాష్ట్రాల్లో నిరంతరం ఎన్నికలు జరుగుతూ వుండటం వల్ల ఎలక్షన్ కోడ్ కారణంతో సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ పడుతోందని, జమిలి వల్ల అలాంటి ఇబ్బందులు వుండవని అంటున్నారు. ప్రధాని తదితర బీజేపీ నాయకులు జమిలి ఎన్నికల విషయలో చాలా ఉత్సాహంగా వున్నారు. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ కూడా జమిలి ఎన్నికలకు తన ఆమోదం తెలిపింది. కానీ, ఆచరణలో ఎంతవరకు సాధ్యమన్నది ఒక చిక్కు ప్రశ్న.
జమిలి ఎన్నికల విషయంలో అంతరార్థ విశ్లేషణ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-nation-one-election-39-185067.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.