Publish Date:May 17, 2024
మామూలుగా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వుంటాయి. కానీ, కొంతమంది అనంతకోటి దరిద్రాల కోసం శతకోటి ఉపాయాలను ఆలోచిస్తారు. ఈ జనరేషన్ యూత్ ఇలా ఆలోచించే వాళ్ళలో ముందుంటారు. ముఖ్యంగా అమెరికన్ యూత్ అయితే ఏ మెంటల్ పని చేయడానికైనా రెడీగా వుంటారు. అలా ఇప్పుడు అమెరికన్ కుర్రోళ్ళు చేస్తున్న ఒక మెంటల్ పని ‘వన్ చిప్ ఛాలెంజ్’.
అసలేంటీ ‘వన్ చిప్ ఛాలెంజ్’. మన టీవీ షోలలో అప్పుడప్పుడు మిరపకాయలను తినే పోటీలు వుంటాయి చూశారా అలాంటి పోటీనే. కాకపోతే మిరపకాయల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ఘాటు వున్న చిప్ తినే పోటీ. పాఖీ అనే చిప్స్ తయారు చేసే సంస్థ అత్యంత ఘాటుగా వుండే పదార్థాలతో ఒక చిప్ తయారు చేస్తూ వుంటుంది. దాన్ని శవపేటిక ఆకారంలో వుంటే ఒక ప్యాక్‌లో వుంచుతుంది. ఈ సంస్థ అమెరికన్ యూత్‌కి ఒక ఛాలెంజ్ చేసింది. తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవాళ్ళని నోరు మండిపోవడం తప్ప వచ్చేదీ చచ్చేదీ ఏమీ వుండదు. అయినప్పటికీ అమెరికన్ వెర్రి యూత్ ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. తమ ఫోన్లలో వీడియో కెమెరా ఆన్ చేసుకుని, బ్యాక్ గ్రౌండ్లో కౌంట్ డౌన్ టైమర్ పెట్టుకుని చిప్ తింటూ వుంటారు. ఐదు క్షణాలు కౌంట్ డౌన్ అయ్యే వరకూ ఆ చిప్ ధాటికి కుయ్యో మొర్రో అంటారు. ఐదు క్షణాలు దాటిన తర్వాత ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఎక్స్.ప్రెషన్ ఇస్తారు. ఇదీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్’ వ్యవహారం.
ఈ దిక్కుమాలిన ఛాలెంజ్‌లో కుర్ర సన్నాసులతోపాటు అమెరికాలో వున్న సెలబ్రిటీస్ కూడా పాల్గొనడంలో ఇది బాగా పాపులర్ అయిపో్యింది. వన్ చిప్ ఛాలెంజ్ చేయనివాడు యూత్ కాదన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ ఛాలెంజ్ అంత ఈజీగా వుండదు. ఆ దిక్కుమాలిన చిప్ తినగానే నోరు మండిపోతుంది. ఐదు క్షణాలపాటు కూడా భరించలేనంత మండిపోతుంది. ఐదు క్షణాలపాటు అలాగే వున్నవారి సంగతి అలా వుంచితే, చిప్ తినగానే భళ్ళున వాంతులు చేసుకున్నవాళ్ళు, కళ్ళుతిరిగి పడిపోయినవాళ్ళు, నోరు మండిపోయి చాలారోజులు ఏమీ తినలేక తంటాలుపడిన వాళ్ళు కోకొల్లలు.
సరే, ఎవరి పిచ్చి వారికి ఆనందం అని ఊరుకోవచ్చు. కానీ, 2023 సెప్టెంబర్లో ఒక ఘోరం జరిగింది. ఈ వన్ చిప్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వొలోబా అనే కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రమైన ఘాటు వల్ల అతని గుండెపోటు వచ్చి చనిపోయాడు. దాంతో పాఖీ కంపెనీని అందరూ తిట్టిపోయడంతో ఈ కంపెనీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్’ని ఉపసంహరించుకుంది. మార్కెట్లో వున్న తమ కంపెనీ చిప్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ప్రకటించింది. అయితే, ఈ చిప్స్ స్టాక్‌ని చాలామంది వెనక్కి ఇవ్వలేదు. సీక్రెట్‌గా అమ్మకాలు జరుగుతూనే వున్నాయి. ‘వన్ చిప్ ఛాలెంజ్’ వీడియోలు వస్తూనే వున్నాయి. ఈ దారుణమైన ఛాలెంజ్ వల్ల ఇంకా ఎంతమంది చనిపోతారో అని అమెరికా పేరెంట్స్ భయపడుతున్నారు. యూత్‌కి ఈ మెంటల్ ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-chip-challange-39-176193.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.