రైతులను గాలికి వదిలేశారు: బాబు
Publish Date:Oct 27, 2011
Advertisement
హైదరాబాద్: నవంబర్ 2వ తేదీ నుంచి కరువు మండలాల్లో రైతు పోరు యాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నాట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. నవంబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా నుంచి తన యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.ఈ సందర్బంగా ఆయన రైతు సమస్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆయన విమర్సించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎరువులను అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 700 మండలాల్లో కరువు నెలకొని ఉందని ఆయన చెప్పారు. సెజ్‌ల పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని ఆయన అన్నారు. భూములకు మార్కెట్ ధర ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. రైతులకు బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆయన విమర్శించారు.
కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు సగానికి పైగా ఎండిపోయాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. తాము పోరుబాటు చేపడుతామని ఆయన అన్నారు. వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం స్వామినాథన్ నివేదికను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నవంబర్ 2 నుంచి 22 జిల్లాల్లో రైతు పోరు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తానని ఆయన చెప్పారు. 37 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆయన అన్నారు. సాగునీటి సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/november-24-7955.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





