వైసీపీకి నేతలే కాదు.. క్యాడరూ దూరమే!.. ఇది జగన్ స్వయంకృతమే!

Publish Date:Sep 30, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాశాలు లేకుండా ఆ పార్టీ అధినేత అడుగులు పడుతున్నాయా? నాయకులు, కార్యకర్తలు పార్టీని వదిలి పారిపోయే పరిస్థితులను స్వయంగా సృష్టిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. పిడిక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా జగన్ తన తప్పిదాలను, తన వైఫల్యాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీకీ ఆపాదించి చేతులు దులిపేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. బూమరాంగ్ అవుతున్నాయి. వైసీపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి వినియోగం బయటపడిన క్షణం నుంచీ జగన్ వ్యూహాలన్నీ భస్మాసుర హస్తాన్ని తలపింప చేసేలాగే ఉన్నాయి. ఈ వివాదం నుంచి బయటపడటం కోసం ఆయన ఎంచుకున్న ఎదురు దాడి వ్యూహం వైసీపీనీ, జగన్ ను నిండా ముంచేసింది. 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడి కాగానే జగన్ కల్తీ జరిగితే జరిగింది.. కానీ దానికి బహిర్గతం చేయడం ఏమిటి? అంటూ ఎదురుదాడికి దిగారు. కల్తీ అబద్ధమని గట్టిగా చెప్పలేకపోయారు.  జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష అనగానే దానికి కౌంటర్ గా తాను ప్రాయశ్చిత పూజలు అంటూ ప్రకటన చేశారు. తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుని ప్రాయశ్చిత పూజలు నిర్వహిస్తానని ప్రకటించి.. ఇందుకు షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. అయితే తిరుమల వేంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేష్ ఇవ్వడానికి మాత్రం ససేమిరా అన్నారు. తన తిరుమల పర్యటనను సైతం రద్దు చేసేసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తల  పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. జగన్ తన తీరుతో తమ రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టేశారని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇక పార్టీ క్యాడర్ మనో ధైర్యమైతే పాతాళానికి పడిపోయింది. 

జగన్ తన పర్యటనను తానే స్వయంగా రద్దు చేసుకుని ప్రభుత్వం అడ్డుకుందని ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ప్రజల దాకా ఎందుకు తన తిరుమల పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ ఆయన చేసిన ఆరోపణలను సొంత పార్టీ నేతలూ, కార్యకర్తలే నమ్మడం లేదు. నిజంగానే ఒక వేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే పార్టీకి అంత కంటే కావలసిందేముందని, ఎందుకు అనుమతి ఇవ్వరంటూ జగన్ తిరుమల పర్యటనకు బయలు దేరి ఉండాల్సిందనీ శ్రేణులు అంటున్నాయి. అప్పుడు పోలీసులు అడ్డుకుని ఉంటే.. ప్రజలలో మంచి మైలేజ్ వచ్చి ఉండేది కదా అంటున్నారు.  అలా కాకుండా అసలు జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటకుండానే ప్రభుత్వం అడ్డుకుందంటూ చేతులెత్తేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.  

అయినా ఓ వైపు ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనపై ఎలాంటి ఆంక్షలూ లేవని విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా పోలీస్ యాక్ట్ 30 ప్రకారం ఎవరో వైసీపీ కార్యకర్తకు ఇచ్చిన నోటీసును తనకు ఆపాదించుకుని జగన్ పిరికిపందలా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. అలా రద్దు చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి లేకపోవడం ఏ మాత్రం కారణం కాదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని ఆ శ్రేణులు నమ్ముతున్నాయి. జగన్ డిక్లరేషన్ ఇవ్వరు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నాయి.  డిక్లరేషన్ ఇవ్వలేని జగన్ కు తిరుమలలో ప్రాయశ్చిత పూజలు నిర్వహించే అధికారం ఎక్కడిదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. మొత్తంగా ఓటమి తరువాత జగన్ పార్టీని నేతలు వీడుతూ వస్తున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ను నిరాకరించి పార్టీ  కార్యకర్తలూ పారిపోయే పరిస్థితి జగన్ స్వయంగా తెచ్చుకున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.