పేకమేడ‌లా కూలిన  నోయిడా ట్విన్ ట‌వ‌ర్స్‌ 

Publish Date:Aug 28, 2022

Advertisement

ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను ఆదివారం  విజయవంతంగా కూల్చివేశారు. జంట టవర్లు క్షణాల్లో కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున ధూళి విరజిమ్మింది. న‌ల‌భ‌యి అంతస్తుల ట్విన్ టవర్స్.. నాలుగు టన్నుల మందు గుండు.. కేవలం తొమ్మిది  సెకన్లలో నేలమట్టం! అవును  ఇది నిజమే. కానీ సినిమా సీన్ త‌ల‌పించింది.  నోయిడాలో ఉన్న సూపర్‌ టెక్‌ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్‌ కోర్ట్‌ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను కేవలం 9 సెకన్లలో నేలమట్టం చేస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ భవనాలను మే 22 నాటికి కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీం కోర్టుకు ఇటీవల తెలియజేసింది.

సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ హౌసింగ్ సొసైటీని మొదట మంజూరు చేసినప్పుడు, బిల్డింగ్ ప్లాన్‌లో 14 టవర్లు, తొమ్మిది అంతస్తులు చూపించారు. తరువాత, ప్లాన్ సవరించారు.  ప్రతి టవర్‌లో 40 అంతస్తులను నిర్మించడానికి బిల్డర్‌ను అనుమతించారు. అసలు ప్లాన్ ప్రకారం టవర్లు నిర్మించిన ప్రాంతాన్ని ఉద్యానవనంగా మార్చాలి. దీంతో సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు సొసైటీ నివాసితులు 2012లో ఈ నిర్మాణం అక్రమమని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. సూపర్‌టెక్ గ్రూప్ మరిన్ని ఫ్లాట్లను విక్రయించడానికి, వారి లాభాల మార్జిన్‌లను పెంచుకోవడానికి నిబంధనలను ఉల్లంఘించిందని పిటిషనర్లు వాదించారు. దీని ప్రకారం, ఆర్డర్ దాఖ లు చేసిన తేదీ నుండి నాలుగు నెలల్లో (సొంత ఖర్చుతో) టవర్లను కూల్చివేయాలని 2014లో కోర్టు అథారిటీని ఆదేశించింది.

ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. గత ఆగస్టులో, కోర్టు టవర్లను కూల్చివేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది ఒక సంవత్సరం పట్టింది. నోయిడా అధికారులతో కుమ్మక్కై బిల్డర్ భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని సుప్రీంకోర్టు పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ గృహ కొనుగోలు దారులు సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు.

నిర్ణీత సమయానికి డిటొనేషన్ బటన్‌ను నొక్కిన వెంటనే పేలుడు పదార్థాలు పేలడంతో వంద‌ మీటర్ల ఎత్తయిన ఈ జంట టవర్లు కుప్పకూలిపోయాయి. కాంక్రీట్‌తో నిర్మించిన ఈ కట్టడాలు 10 సెకండ్లలో పేక మేడలా కూలిపోవడం అందరినీ ఆశ్చర్య పరచింది, అందరూ ఆనందం వ్యక్తం చేశారు. జంట టవర్లు కూలిపోవడంతో దుమ్ము, ధూళి మేఘాలు ఆ ప్రాంతంలో వ్యాపిం చాయి. ఢిల్లీ లోని ప్రతిష్టాత్మక కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తుగా సూపర్‌టెక్‌ సంస్థ ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో నిర్మించిన జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ట్విన్‌ టవర్స్‌ పేకమేడల్లా కుప్ప కూలాయి.

ముంబయికి చెందిన ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్‌ డిమాలిషన్స్‌ కలిసి ఈ పని చేపట్టాయి. గతంలో తెలంగాణ సచి వాలయం, సెంట్రల్‌ జైలును, గుజరాత్‌లో పాత మొతెరా స్టేడియంను ఈ సంస్థే కూల్చింది. అయితే ఈ కూల్చివేతకు సంబంధిం చిన అన్ని ఏర్పాట్లను ఆదివారం ఉదయమే అధికారులు పూర్తి చేశారు. సూపర్‌టెక్ ట్విన్ టవర్ల చుట్టూ గాలి దిశ తూర్పు వైపు న‌కు మారిందని, దీని వల్ల ధూళి కణాలు ఢిల్లీకి బదులుగా గ్రేటర్ నోయిడా, బులంద్‌షహర్ వైపు మళ్లుతాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా పశ్చిమ దిశగా గాలి వీస్తున్నప్పటికీ ఒక్కసారిగా మార్పు వచ్చిందని ఉత్తర్​ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.