జాతీయ రాజకీయాలలో ఏకాకి కేసీఆర్.. టీఆర్ఎస్ స్టింగ్ ఆపరేషన్ ను విశ్వసించని పార్టీలు

Publish Date:Nov 1, 2022

Advertisement

కేసీఆర్ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని ఏ ముహూర్తాన ప్రకటించారో.. ఆ క్షణం నుంచీ జాతీయ పార్టీల నాయకులు ఆయనను కలుసుకోవడానికే ఇష్ట పడటం లేదు. కేంద్రంలోని మోడీ సర్కార్ పై నిత్యం విమర్శల వర్షం కురిపించే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆప్, ఎన్సీపీ వంటి పార్టీల నాయకులు కూడా కేసీఆర్ కు దూరం పాటిస్తున్నారు.  బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు సాగించిందంటూ.. టీఆర్ఎస్ అందుకు సంబంధించి వాయిస్ ఆడియోలను బయటపెట్టినా బీజేపీయేతర పార్టీలు కానీ, ఆ పార్టీల నేతలు కానీ కేసీఆర్ కు మద్దతుగా, సంఘీ భావంగా కనీసం ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేదు.

బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చేస్తున్న ప్రయత్నాలను స్టింగ్ ఆపరేషన్లో టీఆర్ఎస్ బయటపెట్టినట్లు చెప్పుకుని విస్తృత ప్రచారం చేసినా జాతీయ స్థాయిలో కేసీఆర్ కు ఇసుమంతైనా మద్దతు లభించలేదు. అదేదో రాజకీయాలకు సబంధం లేని కేసీఆర్ కుటుంబ అంతర్గత వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులూ వ్యవహరించి మౌనం వహించారు. ఇటీవలే బీజేపీ కుట్రలకు కుతంత్రాలకు చీలికలు పేలికలైపోయిన ఉద్ధవ్ థాక్రే శివసేన కూడా తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై నోరు మెదపలేదు. టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు మద్దతుగా నిలవలేదు. టీఆర్ఎస్    విడుదల చేసిన ఆడియో టేప్ లలో హస్తినలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేల్చేందుకు కుట్ర జరుగుతోందని ఉన్నా.. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వెనుక సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నట్లుగా సంకేతాలున్నా.. జాతీయ స్థాయిలో పార్టీలేవీ కనీసం స్పందించలేదు. కేసీఆర్ కు మద్దతుగా నిలవలేదు. కేసీఆర్ కు మద్దతు పలుకుతూ పలువురు నేతలు ఫోన్ చేశారని టీఆర్ఎస్ నుంచి ఏవో ఒకటి రెండు ప్రకటనలు వెలువడినా అదంతా ప్రచారంలో భాగమే తప్ప వాస్తవం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎటువైపు నుంచీ కనీస మద్దతు కూడా రాకపోవడం వల్లనే ఎమ్మెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారాన్ని టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఒక ప్రధాన అంశంగా తీసుకువెళ్లడంలో విఫలమైందని వారంటున్నారు. బీజేపీనీ, మోడీ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలూ నాయకులూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఇష్యూగా మార్చి బీజేపీని బదనాం చేయాలన్న టీఆర్ఎస్ ప్రయత్నం కనీస మద్దతు కరవై తుస్సు మంది. బీజేపీ తీరును అవకాశం వచ్చినప్పుడల్లా తూర్పారబట్టే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కానీ, తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ, కేరళర సీఎం పనరయి విజయ్ కానీ కనీసంగా కూడా స్పందించకపోవడంతో అసలు టీఆర్ఎస్ స్టింగ్ ఆపరేషన్ విశ్వసనీయతపైనే అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఇదంతా చూస్తుంటే జాతీయ పార్టీల దృష్టిలో టీఆర్ఎస్ ఓ అంటరాని పార్టీగా మారిపోయిందా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రంలో మోడీ సర్కార్ ఢీ కొట్టే సత్తా ఉన్న నాయకుడిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఎవరి నుంచీ ఆశించిన మద్దతు లభించక ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోయారని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.