‘అగ్నిపథ్‌’ ఫై తగ్గేదే’ లే.. తేల్చేసిన సైన్యం

Publish Date:Jun 19, 2022

Advertisement

సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిన్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో, పథకం కొనసాగించే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని మీడియాలో, సోషల్ మీడియాలో చాల పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అయితే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్’ సింగ్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన  సైనిక  అధికారులు, అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు.  

సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇతర దేశాల సైన్యాలపైనా త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారన్నారు. సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తోన్న సయమంలో వాటిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు త్రివిధ దళాలకు చెందిన అధికారులు నేడు మీడియా ముందుకు వచ్చారు.

‘ప్రస్తుతం సాయుధ దళాల్లో ఉన్నవారి సగటు వయసు 30ఏళ్లకు పైగా ఉంది.ఇలా కొనసాగడం ఆందోళనకర విషయం.యువ సైనికులు అయితే సైన్యంలో టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తారని భావించాం. సెల్‌ఫోన్లు, డ్రోన్లతో యువకులు అద్భుతాలు చేస్తున్నారు. అందుకే యువత సైన్యంలోకి రావటానికి, వెళ్లిపోవటానికి అవకాశాలు పెంచాం. ఈ క్రమంలో అనుభవం ఉన్నవారికి, యువశక్తికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాం’ అని సైనిక వ్యవహారాల విభాగంలో అడిషినల్‌ సెక్రటరీగా ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైన్యంలో వయసుకు సంబంధించి 1999 కార్గిల్‌ యుద్ధంపై ఓ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయన ప్రస్తావించారు.

‘సైన్యంలో యువతను ఎక్కువగా తీసుకునేందుకు సుదీర్ఘ సంప్రదింపులు జరిపాం. ఈ క్రమంలో విదేశీ సైన్యాలను కూడా అధ్యయనం చేశాం. ఎటువంటి సవాళ్లనైనా స్వీకరించే శక్తి యువత సొంతం. కొత్త టెక్నాలజీని యువత త్వరగా అందిపుచ్చుకుంటోంది. మూడు విభాగాల్లో ప్రతి సంవత్సరం 17,600 మంది ముందస్తు రిటైర్‌మెంట్‌ అవుతున్నారు. కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు జరగలేదు. అందుకే ఈసారి ఎక్కువ మందిని నియమించుకోవాలని భావిస్తున్నాం. అగ్నివీర్‌లు సైన్యంలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయి’ అని లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ స్పష్టం చేశారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.