ఇకపై ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతా.. ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారు పద్దతి మార్చుకోవాలి... లేకపోతే వారికి ఇంకో ఛాన్స్ ఉండదు. ఇదీ తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు ముఖ్మమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్త్రాంగ్ వార్నింగ్. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకుచంద్రబాబు శుక్రవారం (మే 1) కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం (మే1) నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంతర్గత సర్వేల ద్వారా టీడీపీ అధినేత నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు సరిగా లేని వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలను కూడా నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇక నుంచి నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ రోజు నుంచి సమావేశాల్లోనే ప్రజలను అడుగుతా. ప్రజలు అనుకూలంగా చేతులెత్తకపోతే ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు పనితీరును సరిదిద్దుకోకపోతే ప్రజల తరుఫున ఉంటాను కానీ.. ఎమ్మెల్యేల తరుఫున ఉండను. వారికి మళ్లీ ఛాన్స్ ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-second-chance-if-dont-improve-perforrmence-25-218744.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!