Publish Date:May 15, 2026
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో దనలు సుదీర్ఘంగా సాగాయి. భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది, వైసీపీ ఎంపి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
అదలా ఉంటే.. తన కుమారుడిపై పోస్కో కేసుకు సంబంధించి తన పేరును ముడిపెడుతూ సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను వెంటనే తొలగించాలని కోరుతూ బండి సంజయ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు బండి సంజయ్ పేరును ముడిపెడుతూ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బండి బగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ప్రస్తావించరాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ పేరుతో ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని, ప్రచురించరాదని కోర్టు ఆదేశించింది.
కాగా బండి సంజయ్ తన కుమారుడు బండి బగీరథ్ ను విచారణకు పంపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు తానుగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా తన కొడుకును విచారణకు అప్పగించి, చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొనేలా చేయాలని సీఎం అన్నారు. బండి సంజయ్ కింది స్థాయి నుంచి స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగారనీ, ఇప్పుడు కుమారుడి కారణంగా తలవంపులు ఎదుర్కొంటున్నారనీ సీఎం అన్నారు. ఏది ఏమైనా విచారణను ఎదుర్కోకుండా బండి భగీరథ్ పారిపోవడంసరికాదన్నారు. బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలనీ, అలా చేస్తే.. అలా చేస్తే బండి సంజయ్ గౌరవం మరింత పెరుగుతుందన్న రేవంత్ రెడ్డి.. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోతే సమస్యలకు పరిష్కారం దొరకదన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-respite-to-bandi-bhagirath-in-high-court-39-219939.html
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.