జగనన్న పోరాటంలో పస లేదు!

Publish Date:Jul 22, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శవరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఐదేళ్లు అధకారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వ విధాలా భ్రష్ఠపట్టించిన జగన్ తన హయాంలో జరిగిన హత్యల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని దుయ్యబట్టింది. ఇప్పుడు వ్యక్తిగత కక్షలలో వినుకొండలో జరిగిన ఒక హత్య ఉదంతంపై తన రాజకీయ లబ్ధి కోసం నానా యాగీ చేస్తున్నారని విమర్శించింది. వినుకొండ ఘటన ద్వారా రాజకీయ లబ్ధి కోసం జగన్ నేల విడిచి సాము చేస్తున్నారు. చివరికి సొంత పార్టీ నేతలు సైతం జగన్ తీరును తప్పుపడుతున్నారు. హస్తినలో ధర్నా ఏ ముఖం పెట్టుకు చేస్తారని అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి, విపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు, వేధింపు చర్యలకే పరిమితమైన జగన్ ఇప్పడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం నవ్వు పుట్టిస్తోందని అంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల సోమవారం(జులై 22)  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని ఏనాడూ డిమాండ్ చేయని జగన్ ఇప్పుడు వినుకొండలో ఒక రౌడీ హత్యను రాజకీయం చేస్తూ హస్తినలో ధర్నా చేస్తానంటున్నారని విమర్శించారు. తానేమీ వైసీపీ, తెలుగుదేశం అనుకూల మీడియా వార్తలను చూసి మాట్లాడటం లేదనీ,  క్షేత్ర స్థాయి నుంచి తమకు అందిన సమాచారం మేరకు వినుకొండలో జరిగిన హత్య వెనుక ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని షర్మిల కుండబద్దలు కొట్టేశారు. హంతకుడు, హతుడూ ఇద్దరూ కూడా వైసీపీకి చెందిన వారేననీ, వారి మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే హత్య జరిగిందని చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తినలో ధర్నాఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత రాజకీయ ఉనికి కోసం వినుకొండ హత్యను వాడుకుంటున్నారని షర్మిల జగన్ పై విమర్శలు గుప్పించారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హస్తినలో గళమెత్తని జగన్ ఇప్పుడు వినుకొండ హత్యను రాజకీయం చేయడం కోసం హస్తినలో ధర్నా చేయడానికి సిద్ధమైపోయారని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీకి అసెంబ్లీలో ఆయనతో సహా కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే జగన్ హస్తినలో ధర్నా అంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీకి హాజరై వివిధ బిల్లులు, ఇతర అంశాలపై మాట్లాడాల్సిన జగన్ అసెంబ్లీకి మొహం చాటేయడానికే హస్తిన పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో తన హయాంలో జరిగిన తప్పిదాలకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజర్ అవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు.  

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.