బెంగాల్లో మరో నిర్భయ ఘటన!

Publish Date:Aug 13, 2024

Advertisement

కోల్ కతాలోని  ఆర్జీకర్ మెడికల్ కాలేజీ లో గత వారం  పీజీ ట్రైనీ డాక్టర్   హత్యాచార  సంఘటన దేశవ్యావ్తంగా సంచలనం రేపింది. ఇది మరో నిర్భయ  ఘటనగా వైద్యులు, నర్సులు భగ్గు మంటున్నారు. ఆసుపత్రిలోనే వైద్యులకు రక్షణ లేకుండా పోతు న్నదని,తమకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా వైద్యులు ఈ దారుణ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు  పిలుపు ఇచ్చారు. జూనియర్ వైద్యులు వైద్య సేవలను బంద్ చేసారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ  ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనను ఖండించడమే కాకుండా సత్వరమే కేసును పరిష్కరించి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. అందులో రాష్ట్ర పోలీసులు విఫలమైతే కేసును   సీబీఐకి అప్పగిస్తానని  రాష్ట్ర పోలీసులను హెచ్చరించారు.  ఈ సంఘటనపై  కాలేజీ ప్రిన్సిపాల్  రాజీనామా చేశారు. నిందితుడు సంజయ్ రాయ్ పోలీస్ విభాగంలో వాలంటీర్ గా పనిచే స్తున్నాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేసేవాడు. తరువాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. అతడు ఆసుపత్రి ఔట్ పోస్ట్ లో విధి నిర్వహిస్తున్నప్పుడు యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడని  చెబుతున్నారు.అనేక అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు సైతం సంజయ్ రాయ్ పై ఉన్నాయి.అతడిని పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణకాండలో మరికొందరు కూడా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అత్యాచారానికి ముందు ఆమెను నానారకాలుగా చిత్రహింసలకు గురి చేశారని ప్రథమికంగా నిర్ధారించారు.  విధుల్లో ఉన్న ఆమెను చితకబాది అత్యా చారం చేసినట్లు మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

కళ్లు,పెదవులు,చెవి,కడుపు, మర్మాంగాలులో గాయాలు న్నాయని మెడికల్ రిపోర్టు పేర్కొంది. తెల్ల వారుజామున మూడుగంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని తెలుస్తున్నది. ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని,అటాప్సీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. నర్సులు ఉండగానే అత్యాచారం జరగడం,అత్యాచారం ఘటన సమయంలో మరికొందరు ఉన్నారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణలు గమనార్హం. ముందుగా హత్యచేసి ఆపై అత్యాచారం చేసారని ప్రాధమిక నివేదికలో ఒక వైద్యుడు అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది.

ఘటన జరిగిన రోజు ట్రైనీ డాక్టర్   నర్సులు తో కలిసి టీవీలో ఒలింపిక్స్ క్రీడలను చూశారనీ,  ఆ తరువాత  చదువుకోవడానికి ఆసుపత్రి సెమినార్ హాలులోకి వెళ్లారని నర్సులు చెబుతున్నారు. తెల్లవా రుజామున 3-6 గంటల మధ్య హత్యాచారం జరిగిందని చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.   నిందితులను పట్టుకుని శిక్షించాలని ఆమె సీఎంకు విజ్ఞప్తి చేసారు.   

By
en-us Political News

  
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.