స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jul 10, 2023

Advertisement

26. కర్ణాటక అసెంబ్లీలో మరోసారి కలకలం రేగింది. ఇటీవల ఓ సామాన్య వ్యక్తి అసెంబ్లీలోకి చొరబడి, ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన మరువకముందే.. తాజాగా  ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. 

27. ఏపీలో మహిళల మిస్సింగ్, వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

28. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సమంత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమె ఏడాదిపాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

29.తనకు పీసీసీ చీఫ్ రానందుకు కొన్నిరోజులు బాధపడ్డానని కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం అన్నారు. కానీ తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కతో కలిసి తాను పని చేస్తున్నానని చెప్పారు.

30. భారత చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోన్న విషయాన్ని సినిమా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన్నట్టు ప్రముఖ కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు.

31.ఓ మహిళ అత్యంత కిరాతక హత్యకు గురైన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.  మహిళ చనిపోయిన తీరు వారిని తీవ్రంగా కలిచి వేసింది. ఆమెను చంపిన నిందితులు.. కళ్ల నుంచి గుడ్లను బయటికి తీశారు. ఆ మహిళ ప్రైవేటు భాగాలపై తీవ్ర గాయాలు చేశారు.

32. ఫ్లిప్‌కార్ట్‌  కస్టమర్లు ఇకపై యాక్సిస్‌ బ్యాంక్‌ కు చెందిన పర్సనల్ లోన్స్‌ పొందొచ్చు. గరిష్ఠంగా 3 ఏళ్ల కాలవ్యవధిపై రూ.5 లక్షల వరకు పర్సనల్‌ లోన్స్‌ను మంజూరు చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

33.రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ వెళ్లింది టీమిండియా. నెల రోజులపాటు కొనసాగనున్న ఈ టూర్‌‌.. జులై 12న డొమినికా వేదికగా జరిగే తొలి టెస్టుతో మొదలుకానుంది.

34. తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై మెత్తబడ్డారు.  పెండింగ్‌ బిల్లులను జూలై 15లోగా క్లియర్‌ చేస్తామని తెలంగాణ రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

35. సైకో తరహా విధ్వంసంపై మాజీ సీజేఐ ఎన్వీరమణ చురకలంటించారు. తానా సభలో ఎన్వీరమణ  చేసిన ప్రసంగం లో  సైకో తరహా విధ్వంసంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  తిప్పాలనుకుంటారని దుయ్యబట్టారు.

36. మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.

37.ఈనెల 12న గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ మల్లు రవి వెల్లడించారు.  దేశ ప్రజలు ఐక్యంగా ఉండడానికి రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలిపారు. 

38. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన వెలుగుచూసింది. బతికుండగానే ఓ వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. 

39. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు  భేటీ అయ్యారు. త్వరలో జూపల్లి కాంగ్రెస్‌లో చేరనున్న విషయం తెలిసిందే. 

40. స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్‌పై అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు.

41. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. తానా సభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీతక్కను సీఎంను చేస్తామని ప్రకటించారు.

 42. నెల్లూరు పోలీసు కార్యాలయం ట్రెజరీ నిధులలో గోల్ మాల్ జరిగింది.  ట్రెజరీలో జమ చేయాల్సిన నిధులలో రూ.150 కోట్ల రూపాయల సొమ్మును పరిపాలనా విధుల్లో పని చేసే కొందరు స్వాహా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

 43.  తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కూడా  కొనసాగుతోంది. ఆదివారం  క్యూ లైన్లలో ప్రవేశించినవారు ఈ ఉదయానికి కూడా దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. 

44 ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను జగన్ తో భేటీ అయ్యానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ రోజు ఆయన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.  తమ జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై  చర్చ జరిగిందని చెప్పారు.

45. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగళం అంటూ  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య  సంచలన ఆరోపణలు చేశారు. క మంత్రిగా ఉన్న సమయంలో కడియం అనినీతికి పాల్పడ్డారనీ, అవసరం వచ్చినప్పుడు ఆయన ఆస్తులను బయట పెడతామని చెప్పారు.  

46.  రానున్న ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.  జులై 12, 13 తేదీల్లో వాతావరణ శాఖ రాష్ట్రంలోని  పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.

47.  తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి  విమర్శలు గుప్పించారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రతపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలన్నారు.  సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆమెతెలంగాణకు ఓ గిఫ్ట్ లాంటి హుస్సేన్ సాగర్ ను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అన్నారు. సాగర్ ను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

48. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని వైసీపీ ఎంపి మిథున్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని చెప్పారు. అలాగే జగన్ కేబినెట్ విస్తరణ అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.   

49.ఒంగోలులో  భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   గతంలో ఒంగోలులో ఇలాగే చాలాసార్లు భూమి కంపించిందని..   ఒంగోలులో కొండ ప్రాంతం దిగువన తరచుగా భూమి కంపిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 

50. తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్లపై జరిగే ప్రమాదాలను నివారించడానికి   నిఘా భద్రతా విభాగం, పోలీసు శాఖా సమన్వయంతో పటిష్టమైన సమగ్ర  ప్రణాళికను రూపొందించాలని టి టి డి కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి నిర్దేశించారు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.