స్పీడ్ న్యూస్- 2

Publish Date:Jul 4, 2023

Advertisement

11.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
12. ఆమ్ ఆద్మీ పార్టీ  ఎమ్మెల్యేలకు ఢిల్లీ కోర్టు సోమవారం వినూత్న శిక్ష విధించింది. కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు ప్రాంగణం దాటకూడదని ఆదేశించింది. 
13.బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు కోర్టు 3.3 మిలియన్ డాలర్ల  జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రియో డి జెనీరో శివారులోని తన ఇంటి నివాసం వద్ద సరస్సు నిర్మించినందుకు గాను ఈ భారీ ఫైన్ విధించింది. 
14.విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య, బాలీవుడ్ సీనియర్ నటి టీనా అంబానీ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిన్న అనిల్ అంబానీ వాంగ్మూలం ఇచ్చారు.
15.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సాయంత్రం జరిగే కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
16.దేశ రాజకీయాల్లో కురు వృద్ధుడుగా పేరుగాంచిన ఎన్సీపీ అధినేతకు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీపీని నిట్ట నిలువునా చీల్చిన అజిత్ తన వర్గంతో కలసి షిండే ప్రభుత్వంలో చేరిపోయారు.
17.చైనాలో పర్యటించాలనుకునే అమెరికన్లు పునరాలోచించుకోవాలని బైడెన్ సర్కారు కోరింది. డ్రాగన్ కంట్రీలో ఉన్నపుడు తప్పుడు ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
18.టమాటా ధరలు దేశవ్యాప్తంగా ఆకాశానికి ఎగబాకాయి. వాటిని కొనడం కాదు.. ఆ పేరు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఏ కూరలోనైనా ఇట్టే కలిసిపోయే టమాటా ధరలు కొండెక్కడంతో కూరల నుంచి అవి దూరమయ్యాయి. 
19. ప్రయాణికుల మధ్య వివాదాలకు కేరాఫ్‌గా ఢిల్లీ మెట్రో మారిపోయింది. దాదాపు రోజు మెట్రో ప్రయాణికులు తగవు పడుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. 
20.త్రిదిప్ కే మండ‌ల్ అనే వ్యక్తి నోయిడాలోని ఓ మల్టీప్లెక్స్ లో చీజ్ పాప్‌కార్న్‌, పెప్సీ కొన్నాడు. ట్యాక్సులతో కలిపి 55 గ్రాముల చీజ్ పాప్‌కార్న్‌ కు రూ. 460 బిల్లు వేయ‌గా,  600 ఎంఎల్ కూల్ డ్రింక్‌కు ఏకంగా రూ. 360 చార్జ్ చేశారు. ఇలా రెండింటికే రూ. 820 బిల్లు చూసి ఆ వ్యక్తి అవాక్కయ్యారు.

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.