ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ దుబాయ్ లింక్ తో మిస్టరీ
Publish Date:Apr 15, 2026
Advertisement
మొయినాబాద్‌లో వెలుగుచూసిన ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి అరెస్టుతో మొదలైన ఈ కేసులో, ఇప్పుడు దుబాయ్ కనెక్షన్ బయ టపడటం సంచలనంగా మారింది. విచారణలో భాగంగా పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గత ఏడాది దుబాయ్ లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో మృతి చెందిన కేదార్ పేరు ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. రోహిత్ రెడ్డి సోదరులకు కేదార్‌తో సన్నిహిత సంబం ధాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రోహిత్ రెడ్డి , కేదార్ మధ్య అనేక ఆర్థిక లావాదేవీలు జరిగాయి. డ్రగ్ పార్టీలు నిర్వహించే వ్యక్తులకు పలుమార్లు డబ్బులు పంపినట్లు ఆధారాలు సేకరించినట్టుగా పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా రోహిత్ , రితేష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ భారీ లావాదేవీపై విచారణ జరిపినప్పుడు.. కేదార్‌తో ఉన్న సంబంధాలపై రోహిత్ రెడ్డి, రితేష్ ఇచ్చిన సమాధానాలు ఒకదాని కొకటి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కీలక అంశాలన్నీ పోలీసులు కస్టడీ పొడిగింపు పిటిషన్‌లో స్పష్టంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఒక సాధా రణ డ్రగ్స్ కేసుగా ప్రారంభ మైన ఈ ఘటన, ఇప్పుడు అంతర్జాతీయ లింకులు ఉన్న నెట్‌వర్క్‌గా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/new-twist-in-farmhouse-drugs-case-36-217416.html





