కమలంవైపు చంద్రుడి చూపు

Publish Date:Apr 26, 2023

Advertisement

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలు కలిసే సాగుతాయా అన్న అనుమానాలకు చంద్రబాబు చాలా వరకూ తెరదించేశారు. గతంలో  తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు రావడానికి మోడీ పాలనతో , మోడీ విధానాలతో విభేదించడం కారణం కాదని స్పష్టం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్న విషయం సెంటిమెంటుగా మారిందనీ, ఆ హోదా సాధన కోసమే ఎన్డీయే నుంచి బయటకు రావలసి వచ్చిందని విస్పష్టంగా చెప్పారు.

జాతీయ  న్యూస్ ఛానల్  నిర్వహించిన టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్: ద నీడ్ టు కీప్ ఫైటింగ్  సదస్సులో  పాల్గొన్న చంద్రబాబునాయుడు ఎన్డీయేతో కలిసి పని చేస్తామా అంటే ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూ ముక్తాయించారు. ప్రస్తుతం ఏపీలో జగన్  సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాల్సి ఉందని, అందుకోసం ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పలు సందర్బాలలో చంద్రబాబు విస్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా  రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జనసేనాని అయితే వచ్చే ఎన్నికలలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని విస్పష్ట ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా ఏపీలో తెలుగుదేశంతో జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందన్న భావన అన్ని వర్గాలలో వ్యక్తమౌతోంది.

చంద్రబాబు తాజాగా ఒక జాతీయ స్థాయి చానల్ నిర్వహించిన సదస్సులో చేసిన ప్రసంగం బీజేపీతో పొత్తు ఉంటుందన్న పరిశీలకుల అంచనాకు తగ్గట్టుగానే ఉంది. అయితే చంద్రబాబు ఈ సదస్సులో దేశ ప్రగతి, టెక్నాలజీ, సంక్షేమం తదితర అంశాలలో తన విజన్ ను కూడా ఆవిష్కరించారు. మోడీ మోడల్ కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం భారతీయ జనాభాలో 40% మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. యువత ఎక్కువ కలిగిన దేశం మనది. ప్రభుత్వాలు వారి ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా, అందుకు అనుగుణంగా విధానాలు రూపిందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చన్నారు.  

అలాగే  టెక్నాలజీ పరంగా ఉన్నత దశలో ఉన్నాం. సాంకేతికత విప్లవాన్ని తెస్తుందని తాను మొదటి నుంచీ చెబుతున్నానని పేర్కొన్నారు.  నాలెడ్జ్ ఎకానమీ   ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మారుతుందన్నారు. . సాంకేతిక విప్లవానికి హైదరాబాద్ ప్రస్థానమే నిదర్శమన్న చంద్రబాబు నేడు తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతోందంటే తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా వేసిన బీజాలే కారణమన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు తీసుకురావడానికి నాడు నేను మన బలాలు ఏంటో బిల్ గేట్స్‌ కు వివరించాను. భారతీయులు గణితంలో, ఇంగ్లీషులో ప్రావీణ్యం కలిగిన వారు అని వివరించాను. దీంతో బిల్ గేట్స్ అంగీకరించి హైదరాబాద్‌ లో  మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు.  నాడు తాను  విజన్ గురించి మాట్లాడితే నన్ను విమర్శించారు. కానీ ఆ విజన్ 2020 హైదరాబాద్‌లో సాకారం అయ్యిందని వివరించారు. సమాజం కోసం ముందుచూపుతో పనిచేసే నాయకులు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటారనీ, అలాగే తనూ విమర్శలను ఎదుర్కొన్నాననీ చంద్రబాబు చెప్పారు.  

మొత్తంగా ఈ సదస్సులో దేవ ప్రగతి, సంక్షేమం, సంపద పెంపు సాంకేతిక విప్లవం వంటి ఎన్ని అంశాల గురించి మాట్లాడినా ఆయన మోడీ ప్రభుత్వం, మోడీ మోడల్ అభివృద్ధి, విజన్ లపై చేసిన వ్యాఖ్యలే  హైలైట్ అయ్యాయి. ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణలు ఉంటాయని ఆయన తన మాటల ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేనాని హస్తిన పర్యటన తరువాత ఏపీలోని అధికార వైసీపీతో బీజేపీ సంబంధాలు ఒకింత చెడిన సంకేతాలు కనిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత ఈ సదస్సులో మోడీ మోడల్ కు మద్దతు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.