ఆసక్తి పెంచుతున్న లక్కు కిక్కు

Publish Date:Jun 29, 2012

Advertisement

 మద్యం నూతనపాలసీకి ‘లక్కు`కిక్కు’ పేరిట మంచి ప్రచారమే లభించింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ లక్కు`కిక్కు గురించే చర్చలూ నడిచాయి. లక్కీడీప్‌ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించటం రాష్ట్రప్రజలకు ఆసక్తిని కలిగించింది. మద్యం దుకాణాలు మహిళల పేరిట ప్రకటించటం కూడా ఇదే తొలిసారి. వీరు కుటుంబసమేతంగా ఈ లక్కీడ్రాకు హాజరవటం కూడా పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రోజంతా కష్టపడి అలిసిన వారికి మద్యం ఉపశమనం కలిగించేది. ఇది గతం. ఇప్పుడు మారిన కాలంతో పాటు మారే పరిస్థితులను గమనిస్తే మద్యం తాగటం ఒక ఫ్యాషన్‌ అయింది. విదేశీసంస్కృతిని అనుసరించే యువత రాత్రయ్యేటప్పటికి మద్యం సేవిస్తున్నారు. ఆ మత్తులో ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా మద్యం మాత్రం ఒక నాగరికతగా భావిస్తున్నారు. అన్ని వయస్సుల వారు తాగేస్తున్నారు.  ప్రత్యేకించి 5శాతం భారతీయ మహిళలు కూడా ఈ మద్యానికి బానిసవుతున్నారని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. దీంతో అన్ని వ్యాపారాల్లోకి మద్యం ఒక్కటే లాభసాటి. ఇందులో కేసులు ఎదుర్కొన్న పాత సిండికేటులోని వ్యాపారుల లాభమే నూరుశాతం దాటి సంపాదించటం చిన్నవ్యాపారులను ఆకర్షించింది. చిన్నకాంట్రాక్టులు చేసేవారు, వ్యాపారులు తమ లక్కు పరిశీలించుకోవటానికి ధరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం పలుప్రాంతాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యాపారంతో తమ జాతకం మార్చుకోవాలనుకున్న వారి బలహీనతను జ్యోతిష్కులూ సొమ్ము చేసుకున్నారు. ఆ లక్కు నీకే ఉందోయ్‌! భేషుగ్గా ధరఖాస్తు చేసుకో అంటూ జ్యోతిష్కులు కొందరిని ప్రోత్సహించారు. అలానే నీ పేరు కాకుండా మీ సతీమణి పేరు పెట్టేయ్‌ లక్కు నీదేనోయ్‌ అని సెలవిచ్చిన జ్యోతీష్కులూ ఉన్నారు. వీరి ప్రోద్బలం క్యూను పెంచిందని ఎక్సయిజ్‌ సిబ్బంది తెలిపారు.
 

 

 

గతంలో కన్నా ఈ ఏడాది మద్యం దుకాణాల కేటాయింపు చాలా కష్టతరమైందని ఎక్సయిజ్‌ సిబ్బంది స్పష్టం చేశారు. అయితే లక్కు కొద్దీ తమకు దుకాణం వస్తే వెంటనే సొమ్ము చేసుకోవటానికి పాతమద్యం వ్యాపారికి అమ్ముడుపోయేందుకూ కొందరు సిద్ధమయ్యారు. కొందరైతే పాత వ్యాపారి పేరును పార్టనర్‌గా చూపుతూ ధరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఖమ్మం ఏజెన్సీలో మాత్రం పీసా చట్టం ప్రకారం దుకాణాలు కేటాయించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడ 71దుకాణాలకు లాటరీ నిలిచిపోయింది. మళ్లీ జాబితా పరిశీలించి అర్హులను నిర్ణయిస్తామని ఎక్సయిజ్‌ సిబ్బంది ధరఖాస్తుదారులను తిప్పి పంపించారు. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో 212దుకాణాలకు గాను 354 ధరఖాస్తులు అందాయి. వీటిలో 154దుకాణాలకు  మాత్రమే లాటరీ తీయవచ్చు. మిగిలిన 81 దుకాణాలకు ఒక్క ధరఖాస్తు వచ్చింది. మొత్తంగా పరిశీలిస్తే ఈ ధరఖాస్తులను బట్టి 71దుకాణాలకే పోటీ ఉంది. ధరఖాస్తులు అందని దుకాణాలకు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఎక్సయిజ్‌ కమిషనర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని పాతమద్యం సిండికేట్లు కొత్తయోచన చేశాయి. మొత్తం దుకాణాల కేటాయింపు పూర్తయ్యాక ప్రాంతాల వారీగా పార్టనర్‌గా చేరి వ్యాపారం సొంతం చేసుకోవాలని వారు ఉబలాటపడుతున్నారు.

By
en-us Political News

  
భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.