రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో జోష్.. పాతిక పార్టీలతో ముగింపు సభకు భారీ సన్నాహాలు

Publish Date:Jan 17, 2023

Advertisement

రాహుల్ పాదయాత్రకు ముందు వరకూ.. కాదు కాదు రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తరువాత కూడా ఇటీవలి వరకూ దేశంలో కాంగ్రెస్ పునర్వైభవం తరించుకుంటుందన్న ఆశ ఎవరిలోనూ లేశ మాత్రంగానైనా లేదు. ఆఖరికి కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఆయన యాత్ర ఏదో అద్భుతం చేస్తుందనీ, పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందనీ చిన్ప పాటి ఆశ కూడా కనిపించలేదు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా మాత్రమే కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుంటోందన్న భావనే సర్వత్రా కనిపించింది.

అయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా.. దేశంలో ద్వేష భావాన్ని రూపుమాపడానికే ఈ నడక అని ప్రకటించి యాత్ర ప్రారంభించారో అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా ఆయన యాత్రకు సానుకూలత వ్యక్తం అవ్వడమే కాదు.. కాంగ్రెస్ లోనూ జోష్ పెరుగుతూ వస్తోంది. ఇక రాహుల్ యాత్ర ముగింపు దశకు వచ్చే సరికి బీజేపీయేతర పార్టీలన్నిటికీ.. ఒకటి రెండు మినమా.. అలా మినహా పార్టీలలో సమాజ్ వాదీ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయను కోండి అది వేరే సంగతి. సమాజంలోని అన్ని వర్గాలలో కూడా రాహుల్ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభించింది. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న తొలి అడుగు పడింది మొదలు, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా,ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుడా, సాఫీగా సాగిపోతోంది. చివరకు, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పాదయాత్ర చేయలన్నా,అవరోధాలు, అరెస్టులు తప్పని, తెలంగాణ రాష్ట్రంలోనూ, ఏపీలోనూ  రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే, రాష్ట్రం దాటేసింది. అలాగని రాహుల్ యాత్ర ఎవరికీ పట్టకుండా, ఎవరినీ పట్టించుకోకుండా సాగుతోందని చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు. యువత, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పేదలు, నిరుద్యోగులు, మహిళలు, మాజీ బ్యూరోక్రాట్లు ఇలా ఈ వర్గం.. ఆ వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు రాహుల్ గాంధీతో అడుగు కదుపుతున్నారు. జోడో యాత్రలో పాల్గొంటున్నారు.

ఆయన యాత్ర కొనసాగుతుండగా జరిగిన ఎన్నికలలో పార్టీ పరాజయాన్నే ఎదుర్కొని ఉండొచ్చు. అయితే వాటిని వేటినీ ఇసుమంతైనా పట్టించుకోకుండా రాహుల్ ప్రదర్శించిన స్థితప్రజ్ణత జనతను ఆకట్టుకుంటోంది.  నిజానికి, రాజకీయ నాయకుల పాదయాత్ర అంటే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకచో కొద్దిమంది ఇతర రంగాల సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారు. కానీ, రాహుల్ యాత్రలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే, సెలబ్రిటీలే ఎక్కువగా పాల్గొంటున్నారా అన్నట్లుగా, యాత్ర చాలా కలర్ ఫుల్’గా సాగుతోంది. సినిమా స్టార్లే కాదు, కాలేజీ అమ్మాయిలు, విద్యార్ధులు, యువకులు, చివరకు చిన్న పిల్లలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు.  

సహజంగా రాజకీయ నాయకుల పాదయాత్రలలో గంభీర ఉపన్యాసాలు, సీరియస్ చర్చలు ఉంటాయి. జెండాలు, స్లొగన్స్ ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ యాత్రలో రాజకీయ వాసనలు అంతగా కనిపించడం లేదు. రాహుల్  యాత్ర ఒక పిక్నిక్ లాగా సాగిపోతోందని, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఆట పాటలు, సెల్ఫీలు, కరచాలనాలు, హగ్గులు, ఆలింగానాలు ఒకటని కాదు, ఒక ప్రత్యేక పంధాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది.  ఈ యాత్ర ఇప్పటికే  ముగింపు దశకు వచ్చేసింది. ఈ నెల 30న ముగియనుంది. పార్టీలో ఉత్సాహాన్ని నింపిన ఈ యాత్ర ముగింపును భారీగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది, ముగింపు సభ కోసం  దేశంలో భావసారూప్యత కలిగిన 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. మాయావతి (బహుజన్ సమాజ్ పార్టీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ), నితీశ్ కుమార్ (జనతాదళ్ యూనియన్), చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం పార్టీ), లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ్ జనతా దళ్), అఖిలేష్ యాదవ్ (సమాజ్‭వాదీ పార్టీ), కమ్యూనిస్ట్ పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. వీరిలో ఎవరు హాజరౌతారు, ఎవరు గైర్హాజరు అవుతారన్నది పక్కన పెడితే.. (ఇప్పటికే మాయావతి కాంగ్రెస్ వైపు చూసేది లేదని ఖరాఖండిగా ప్రకటించేశారు.)   ఈ నెల 30న జరిగే రాహుల్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి  ఎంత మంది హాజరవుతారన్న విషయంలో ఉత్కంఠ కలిగిస్తోంది.

అయితే.. ఎవరు హాజరౌతారు, ఎవరు గైర్హాజరౌతారు అన్నది పక్కన పెడితే.. రాహుల్ పాదయాత్ర.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇటీవల పదేళ్లలో కాగడాపెట్టి వెతికినా కనిపించని మద్దతును తీసుకు వచ్చింది. ఈ సానుకూలత 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నది తెలియాలంటే వేచి చూడక తప్పదు.  

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.