రాహుల్ కొత్త గురువు ఎవరంటే ?

Publish Date:Jan 1, 2023

Advertisement

రాహుల్ గాంధీలో మార్పువచ్చింది. భారథ్ జోడో యాత్ర అయనలో మార్పు తెచ్చింది.  గతంలో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా వరకు ఆయన్ని సీరియస్ రాజకీయ నాయకుడిగా గుర్తించలేదు. ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ మిత్ర పక్షాల నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించలేదు.

పార్లమెంట్ లో కన్ను కొట్టడం, హటాత్తుగా లేచి వెళ్లి ప్రధాని మోడీ మీద పడి కౌగిలించుకోవడం వంటి పిల్ల చేష్టలు ఆయన ఇమేజ్ ని మరింతగా పలుచన చేశాయి, ఆలాగే ఎవరికీ చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేయడం, యూపీఎ హాయాంలో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆర్డినెన్సును  విలేకరుల సమావేశంలో  చించి  పడేయడం, వంటి చర్యలు కూడా ఆయన రాజకీయ అపరిపక్వతను దేశం ముందుంచింది. అందుకే ఆయనకు రాజకీయాలు తెలియవని, ఆయన ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని, దేశ, విదేశీ జర్నలిస్టులు, విశ్లేషకులు తీర్పు నిచ్చారు. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవని నిర్దారించారు.  అలాగే, గడచిన ఏడెనిమిది సంవత్సరాలో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిన డజన్ల కొద్ది సీనియర్  నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు  రాహుల్ గాంధీనే కారణమని, ఆరోపించారు. వెళుతూ వెళుతూ అక్షింతలు వేసి మరీ వెళ్ళారు. 

అయితే భారత జోడు యాత్ర తర్వాత రాహుల్ గంధిలో గుణాత్మక మార్పు వచ్చిందని కొందరైనా ఆయన్ని రాజకీయ నాయకుడిగా గుర్తిస్తున్నారు. గతంలో  రాహుల్ గాంధీని, పప్పూ అని అవహేళన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు  తమ మాటను వెనక్కి తీసుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంతటి వాడు  భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, రాహుల్ గాంధీలో  పెద్దమనిషి  లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. నిజానికి, రాజకీయ అనుబంధాలు, అవరోధాల కారణంగా కొందరు రాహుల గాంధీ పెద్దరికాన్ని, నాయకత్వాన్ని ఇంకా గుర్తించలేక పోతున్నారు కానీ  రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది. ఆయన నేతగా ఎదిగారు  అనే వాళ్ళు లేక పోలేదు.  

అదలా ఉంటే  భారత్‌ జోడో యాత్ర  నుంచి క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విరామం తీసుకున్న రాహుల్ గాంధీ  శనివారం (డిసెంబర్ 31) ఢిల్లీలో మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ తనకు గురువు లాంటివని ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏదైనా, ఆయా ఏ బాటలో వెళుతున్నారో ఆ వ్యాఖ్యలు స్పష్టం చేసాయి. నిజానికి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ముందు నుంచి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య విద్వేషం రగిలిస్తోందని, భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రేమను పంచుతూ ..అందరినీ ఏకం చేసే ప్రయత్నం సాగిస్తోందని చెప్పు కున్నారు. నిజానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు  అదే  ట్యాగ్ లైన్  గా చెప్పుకుంటున్నారు.

ఇప్పడు యాత్ర విరామ సమయంలో ఆయన, ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీని తాను గురువులా భావిస్తానని అన్నారు. బీజేపీ తనకు రోడ్‌ మ్యాప్ ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీని చూసే తాను ఎలా ఉండకూడదో, ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తమపై ఎంత దూకుడుగా దాడి చేస్తే.. తమ పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు అంతగా సాయపడుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రను తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఒక సాధారణ యాత్రగా ప్రారంభించానని.. అయితే  అది క్రమంగా ప్రజల గొంతుకగా మారి, వారి భావోద్వేగాలను ప్రతిబింబింస్తోందని రాహుల్ తెలిపారు.

 అయితే, రాహుల్ గాంధీ బీజేపీ,ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వలన  కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏదైనా ప్రయోజనం చేకురుతుందా? అంటే  ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రవచించే హిందూ జాతీయ వాదం ముందెన్నడూ లేనంతగా ప్రజామోదం పొందుతున్న సమయంలో హిందుత్వ భాజాలానికి వ్యతిరేకంగా సాగడం, ఒక విధంగా ఏటికి ఎదురీదటమే అవుతుందని, కొందరు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా, రాహుల్ గాంధీ చెపుతున్న విషయాలు ప్రవచనంలా వినడానికి బాగుంటాయి కానీ, ఆచరణలో కష్టమని అంటున్నారు.

నిజానికి, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ప్రవచిస్తున్న హిందుత్వ వ్యతిరేక లౌకికవాదానికి, రాహుల గాంధీ చెపుతున్న కొత్త సిద్ధాంతానికి భాషలోనే కానీ, భావనలో పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజలు వ్యతిరేకించిన హిందూ వ్యతిరేక లౌకిక వాదాన్నే రాహుల గాంధీ,  లౌకిక వాదం,సెక్యులరిజం పదాలు వాడకుండా కొంత భిన్నంగా ప్రెజెంట్ చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీ కూడా  భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ, వ్యక్తిగత ఇమేజ్ ని పెంచవచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీకి జరిగేది, ఒరిగేది ఏదీ లేదని, ఏమీ ఉండదని అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.