సీఎం రేవంత్‌ను కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్‌

Publish Date:Apr 29, 2026

Advertisement

 

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పని చేయాలని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలని సూచించారు.1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ను రాష్ట్ర డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతల స్వీకరణ: ప్రస్తుత డీజీపీ బి.శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సీవీ  ఆనంద్ మే 1న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సి.వి. ఆనంద్ తన సేవా ప్రయాణాన్ని వరంగల్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ప్రారంభించి అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. అదనపు ఎస్పీగా ఆదిలాబాద్‌లో, ఎస్పీగా నిజామాబాద్‌లో పనిచేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, సీఐడీ డీఐజీగా, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తరువాత హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్‌గా సేవలందించిన ఆయన 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 

2016 నుంచి 2018 వరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సంస్కరణలు అమలు చేశారు. అనంతరం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ  డైరెక్టర్‌గా 2018 నుంచి 2021 వరకు పనిచేశారు. 2021 నుంచి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించి, ఏసీబీ డైరెక్టర్ మరియు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కూడా సేవలందించారు. 2024 నుంచి 2025 వరకు మళ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి, 2025 సెప్టెంబర్ నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

By
en-us Political News

  
బెంగళూరు నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అతలాకుతలం చేసింది.
ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
చిత్రవిచిత్రమైన కేసులు, క్లయింట్ల మొండి వైఖరితో న్యాయమూర్తులు ఎంతవరకు విసుగుచెందుతారో చూపించే ఆసక్తికర సంఘటన ఇది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఓటర్ల ఉత్సాహంతో ఊగిపోయింది
ఏపీ సీఎస్ జి. సాయిప్రసాద్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించిన సూడో పోలీసును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.