ఏపీలో కరోనా కొత్త వేరియంట్..మళ్లీ క్వారంటైన్ లు, ఐసోలేషన్ లు తప్పవా?

Publish Date:Jul 21, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ మరో సారి కరోనా ఇసోలేషన్ లు, క్వారంటైన్ ల భయాన్ని తీసుకువస్తున్నది. ఇప్పుడు ఏపీలో వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా కొత్త వేరియంట్ గా నిర్థారించారు.   ఇటీవల కడప జిల్లాతో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కోవిడ్ సోకిన బాధితుల నుంచి సేకరించిన  బాధితుల నమూనాలను పూణేలోని  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఎన్ఐవీ పరిశోధన కేంద్రంలో  నిర్వహించిన అధునాతన జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణలో బాధితులకు  ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5   అనే నూతన వేరియంట్ సోకినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం, తీవ్ర భయాందోళనలు ప్రజల మనస్సుల్లో ఇంకా సజీవంగానే ఉండటంతో ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కొత్త కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదకరమనది కాదని స్పష్టం చేసింది.  

రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఉనికి అధికారికంగా వెలుగుచూసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితుల నమూనాల ఫలితాల నివేదిక అందగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో   సమీక్ష నిర్వహించారు.  వర్చువల్ సమావేశాల ద్వారా వైద్యాధికారులతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల నమోదు వేగం, ప్రస్తుతం ప్రభుత్వ,  ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఆక్సిజన్ నిల్వలు,  ముందస్తు జాగ్రత్త చర్యలపై సమగ్ర నివేదిక తీసుకున్నారు.  

 ప్రస్తుతం రాష్ట్రంలో వెలుగు చూసిన ఆర్‌ఎఫ్.5 వేరియంట్ ప్రమాదకరమైనది కాదని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇది  సాధారణ సీజనల్ కొవిడ్ ఇన్ఫెక్షన్ తెచ్చే వేరియంట్‌ అని చెబుతున్నారు. కోవిడ్ సోకిన వారిలో  తీవ్రమైన గొంతు నొప్పి, పొడి దగ్గు,   జ్వరం, తలనొప్పి, జలుబు, అలసట ఉంటాయనీ, అలాగే..   కండరాల నొప్పులు కూడా ఉంటాయని వైద్యులు తెలిపారు. 

Covid New Variant RF5,  Omicron Sub Variant AP, Kadapa Covid Samples,  Pune NIV, Health Minister Satya Kumar Yadav Review 

By
en-us Political News

  
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి రాసే నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.