కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం: సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం

Publish Date:Jun 2, 2026

Advertisement

కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, తిరుగులేని  ట్రబుల్‌షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్  కర్నాటక సీఎంగా బుధవారం (జూన్ 3) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కర్నాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎన్నో  ఒడుదొడుకులు, సుదీర్ఘ నిరీక్షణల అనంతరం డీకే కర్ణాటక రాష్ట్ర  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.  ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, పార్టీని సంక్షోభాల నుంచి ఒంటిచేత్తో  బయటపడేసిన  64 ఏళ్ల ఈ సీనియర్ నాయకుడి కల ఎట్టకేలకు సాకారమైంది.

డీకేకి సీఎం పదవి దక్కడంతో   కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. కర్ణాటక శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శివకుమార్, ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని  ప్రకటించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం తనపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రైతులు, మహిళలు, యువత భాగస్వామ్యంతో రాష్ట్రంలో  నవ యుగం' సృష్టిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

ఈ చారిత్రాత్మక ఘట్టానికి బెంగళూరులోని లోక్‌భవన్‌ గ్లాస్ హౌస్ ముస్తాబైంది. బుధవారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. డీకే శివకుమార్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వేడుకలో జ్యోతిష్యుల సలహాలు, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా మార్చారు. డీకే శివకుమార్‌తో పాటు తొలి విడత   13 మంది కీలక నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాలను సమతూకం చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఈ మంత్రివర్గాన్ని కూర్చింది. ఇందులో భాగంగా సీనియర్ దళిత నాయకుడు జి.పరమేశ్వర రాష్ట్ర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా, మరో సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 

తొలి విడతలో ప్రమాణం చేయబోయే 13 మంది మంత్రుల   జాబితాలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యాతీంద్రతో పాటు, కేహెచ్ మునియప్ప, యూటీ ఖాదర్, కేజే జార్జ్, కృష్ణ బైరేగౌడ, ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, బైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి బలమైన నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రాన్ని నడిపించి, అధికార మార్పిడి సజావుగా సాగేలా సహకరించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  (సీడబ్ల్యుసీ) సభ్యుడిగా సిద్ధరామయ్యను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఉన్న ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, కర్ణాటకలోని వివిధ ప్రముఖ మఠాల అధిపతులు తరలివస్తున్నారు.  

By
en-us Political News

  
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.