Publish Date:May 17, 2024
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో. మరొకటి ఏపీలో పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ అయిన మంజులారెడ్డి అనే మహిళపై వైసీపీ మూకలు గొడ్డలితో దాడి చేసి నరికితే నుదుటిపై రక్తం గాయంతో కూడ నిర్భయంగా నిలబడిన ఫొటో.
ఆమె అంతటి గాయంతోనూ ఆసుపత్రికి కాదు.. పోలింగ్ ఏజెంట్ ను పోలంగ్ బూత్ లోకే వెడతానని చెప్పింది. ఇప్పుడు ఈ రెండు ఫొటోలనూ, రెండు సంఘటనలనూ పోలుస్తూ జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అంటూ నెటిజనులు ఏకి పారేస్తున్నారు. గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఊరూ వాడా ఏకం చేసేయడమే కాకుండా ఆసుపత్రికి వెళ్లి ఆ గాయానికి ఓ అరడజనుకు పైగా వైద్యుల బృందంతో చికిత్స చేయించుకుని, నుదుటిపై బ్యాండేజీ వేయించుకున్న జగన్ ఎక్కడ.. నుదుటిపై అంగుళం లోతు గాయంతో.. ముఖమంతా ధారగా కారిన రక్తంతో కూడా ధైర్యంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి తెలుగుదేశం ఏజెంట్ గా కూర్చున్న మంజులారెడ్డి ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు.
జగన్ నుదుటిపై గాయమైతే ఒక్కటంటే ఒక్క రక్తం చుక్క కారిన దాఖలాలు లేవు. ఏక్కడో దూరం నుంచి గులకరాయితో దాడి చేస్తేనే హత్యాయత్నం అంటూ నానాయాగీ చేసిన జగన్, తనకు తగిలిన గాయానికి రోజుకో సైజులో ప్లాస్టర్ తో దర్శనమిస్తే.. మంజులారెడ్డి నుదుటిపై అంగుళం మేర లోతు గాయంతో ధారగా కారుతున్న రక్తంతో , దెబ్బలతో వాచిపోయిన ముఖంతో చలించకుండా ఆసుపత్రికి పరుగులు తీయకుండా పోలింగ్ బూత్‌లోనే కూర్చుంది. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మంజులారెడ్డి ధైర్యాన్ని ప్రస్తుతిస్తూ జగన్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/netizens-troll-jagan-comparing-his-injury-with-rentala-women-manjulareddy-39-176197.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.