బాలయ్య ఫుల్ ఖుషీ.. బసవతారకంపై నీతి ఆయోగ్ ప్రశంసలు

Publish Date:Jun 30, 2021

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో  వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, సత్యసాయి ఆస్పత్రులపై నీతిఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ఈ ఆస్పత్రులకు ఇచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్నందున ఈ హాస్పిటల్స్ కు వందశాతం పన్నుమినహాయింపు ఇవ్వాలని నీతిఆయోగ్ కేంద్రాన్ని కోరింది. 

దివంగత సీఎం ఎన్టీఆర్ తన సతీమణి క్యాన్సర్‌తో చనిపోయారు. క్యాన్సర్ బారినపడిన భార్యకు సరైన చికిత్స చేయించలేకపోయామేనని ఎన్టీఆర్ ఆవేదన చెందారు. నాటి పరిస్థితులను మార్చాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ బసవతారకం ఆస్పత్రిని లాభాపేక్ష లేకుండా నిర్మించారు. చివరకు 2000లో బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పేదలకు క్యాన్సర్ వైద్యంలో నమ్మకమైన ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రికి చైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిని 500 పడకలకు విస్తరించారు. తెల్లకార్డు ఉన్న పేదలకు దాదాపుగా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇతరులకు కూడా చాలా తక్కువ మొత్తంతో క్యాన్సర్ వైద్యం అందిస్తారు. వ్యాధి వచ్చిన వారికే కాకుండా.. క్యాన్సర్ రాకుండా అవగాహన చేపట్టడం.. పేదల ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం వంటివి ఈ మెమోరియల్ ఆస్పత్రి చేస్తోంది. 

అనంతపురం జిల్లాలోని సత్య సాయి హాస్పిటల్ లో కూడా రూపాయి తీసుకోకుండా అత్యాధునిక వైద్యం పేదలకు అందుతోంది. ప్రతి నెలా అనంతపురం జిల్లాలోని 12 నోడల్‌పాయింట్లలో మొబైల్‌ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. 400 గ్రామాల ప్రజలు ఉచితంగా సేవలు పొందుతున్నారు. బసవతారకంతో పాటు సత్యసాయి ఆస్పత్రులకు ఇప్పటి వరకూ వీటికి వచ్చే విరాళాల్లో యాభై శాతం పన్ను మినహాయింపు ఉంది. ఇక నుంచి వంద శాతంఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ రెండు హాస్పటల్స్ లో  ఏదైనా విరాళమో.. ఆదాయమో వస్తే.. ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తారు. 

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‎స్టిట్యూట్‌తో పాటు పుట్టపర్తిలోని సత్యసాయి ఆసుపత్రులపై నీతిఆయోగ్ ప్రశంసలపై బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ స్పందించారు. దేశ అత్యున్నత ప్రణాళిక వ్యవస్థ నీతి ఆయోగ్ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత అంతా తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావుకే చెందుతుందన్నారు. పేదలకు సముచిత ధరలో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్స అందాలన్న తన తండ్రి దార్శనికత వల్లే ఈ గుర్తింపు లభించిందని చెప్పుకొచ్చారు. ట్రస్టు సభ్యులు, పెద్ద మనసు చూపుతున్న దాతలు, యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది తన తండ్రి ఆశయాన్ని నిజం చేస్తున్నారని బాలకృష్ణ కొనియాడారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.