Publish Date:Jun 11, 2025
జగన్ సొంత మీడియా చానెల్ లో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది. కృష్ణంరాజు అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను ఎన్‌సీడబ్ల్యూ సుమోటోగా తీసుకుంది. ఈ విషయంపై వేగంగా, నిర్దుష్ట కాలపరిమితిలోపు దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహాట్కర్ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. మూడు రోజుల్లోపు దీనిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఇప్పటికే కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విజయవాడ అయోధ్యనగర్‌లోని ఆయన ఇంటికి తాళం వేసి ఉందనీ.. కుటుంబసభ్యులు కూడా లేరని సమాచారం. కృష్ణంరాజును పట్టుకోవడానికి తుళ్లూరు డీఎస్పీ టి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలకు డీఎస్పీ సలహాలు, సూచనలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణంరాజు కదలికలను పసిగట్టే పనిలో ఉన్నారు. విజయవాడ నుంచి ఎక్కడికి, ఎప్పుడు వెళ్లారనే విషయాలను నిఘా పోలీసులు ఆరాతీస్తున్నారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న వీవీఆర్ కృష్ణంరాజు జర్నలిస్ట్ అనే ఆంగ్ల మాసపత్రికకు ఎడిటర్‌గా చెలామణి అవుతున్నారు. జర్నలిస్ట్ పత్రిక పేరుతో గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రెడిటేషన్లు పొందినట్టు ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ సమావేశాలు పెట్టి తానో సుద్దపూసనని ప్రచారం చేసుకుంటారు. ఏపీ టీవీ జర్నలిస్ట్ అనే మల్టీమీడియా న్యూస్ ఏజెన్సీకి స్వయం ప్రకటిత సీఈవో గా ఉన్నారు. బెజవాడ ప్రెస్‌క్లబ్ అంటూ హడావుడి చేశారు. గది అద్దెకు తీసుకుని కార్యాలయం కూడా ప్రారంభించారు. అయితే అటువైపు ఎవరూ చూడకపోవడంతో అద్దె దండుగ అంటూ దానిని మూసేశారు.
కొమ్మినేని శ్రీనివాసరావుకు, కృష్ణంరాజుకు పూర్వాశ్రమం నుంచి మైత్రీబంధం ఉంది. కొమ్మినేని చొరవతోనే జగన్ మీడియా చానెల్ డిబేట్‌లో రాజకీయ విశ్లేషకుడి ముసుగులో పాల్గొని 2014-19 మధ్య రాజధాని అమరావతితో పాటు, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విషం కక్కారు. మళ్లీ ఇప్పటి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎజెండాగా పనిచేస్తున్నారు. 2014-19 మధ్య... ఆయనే పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల్ని రెచ్చగొట్టేలా పలు సమావేశాలు నిర్వహించారు. కృష్ణంరాజు ఏ కార్యక్రమం చేసినా జగన్ మీడియా హైలైట్ చేస్తుంది. అలా జగన్ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన పేపర్ క్లిప్పింగ్‌లన్నీ కృష్ణంరాజు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఉంచుకున్నారు. తరచూ తనకు సాక్షి డిబేట్‌లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు... తన జర్నలిస్ట్ పత్రిక పదో వార్షిక సంచిక ముఖచిత్రంపై కొమ్మినేని శ్రీనివాసరావు ఫొటో వేసి, జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అంటూ మిత్రబంధం చాటుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ncw-orders-immediate-action-against-krishnam-raju-39-199715.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.