ఎన్ కన్వెన్షన్ పూర్తిగా అక్రమ కట్టడం.. స్పష్టం చేసిన హైడ్రా

Publish Date:Aug 28, 2024

Advertisement

తెలంగాణలో గత కొన్ని రోజులుగా హైడ్రా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ముఖ్యంగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగిపోతోంది. కాగా తన కన్వెన్షన్ కూల్చివేత అక్రమమని నాగార్జున ప్రకటించారు. ఎలంటి అతిక్రమణలూ లేకుండా పట్టాభూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లారు. అంతే కాకుండా గతంలోనే ఎన్ కన్వెన్షన్ కు కూల్చవద్దన్న కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా హైడ్రా ఓవరేక్షన్ చేసి తన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిందని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి కనీసం అనుమతి కూడా లేదని హైడ్రా తన సుదీర్ఘ వివరణలో కుండబద్దలు కొట్టింది. 

 నటుడు నాగార్జున తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టిఎల్) ను ఆక్రమించి నిర్మించారనీ, అందుకే దానిని కూల్చివేశామని నిర్ద్వంద్వంగా పేర్కొంది.  తన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అక్రమమని, చట్ట విరుద్ధమని నాగార్జున పేర్కొనడాన్ని ఖండించింది.  అలాగే ఎన్ కన్వెన్షన్ ను పట్టాభూమిలోనే నిర్మించామని నాగార్జున చెప్పడం శుద్ధ అబద్ధమని హైడ్రా పేర్కొంది.  ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  ఎన్ కన్వెన్షన్ ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్మితమైన కట్టడమని స్పష్టం చేశారు. అంతే కాకుండా   మొత్తం తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ను పూర్తిగా ఆక్రమించి మరీ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని విస్పష్టంగా చెప్పారు.  

ఎన్ కన్వెన్షన్ కు 2014లోనే జీహెచ్ ఎంసీ నోటీసులు జారీ చేసిందని వివరించారు.  దాంతో అప్పట్లోనే ఎన్ కన్వెన్షన్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారని రంగనాథ్ వివరించారు.  ఆ తరువాత కోర్టు ఎన్ కన్వెన్షన్ యజమానుల సమక్షంలో సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిచిన అనంతరం ఎన్ కన్వెన్సన్ యజమానులకు జీహెచ్ఎంసీ మరో నోటీసు జారీ చేసిందనీ, ఆ నోటీసులో  తమ్మిడికుంట చెరువు ఎఫ్ టిఎల్ ను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని పేర్కొందని వివరించారు.  ఆ తరువాత ఎన్ కన్వెన్షన్ యజమానులు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్ఎస్)  కింద క్రమబద్ధీకరించుకోవడానికి విఫలయత్నం చేశారని హైడ్రా చెర్మన్ రంగనాథ్ పేర్కొన్నారు.  

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.