లోకేష్ వైఖరి పార్టీకి చేటంటూ.. తెలుగుదేశం సీనియర్లలో అసంతృప్తి!

Publish Date:Aug 8, 2026

Advertisement

కృష్ణా జిల్లా విజయ డైరీ చైర్మన్ ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో   దుమారాన్ని రేపుతోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో   అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై  పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది. 

 విజయ డైరీ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేయాలంటూ సొంత పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సీనియర్ నాయకుడు చెలసాని ఆంజనేయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంత్రుల వేధింపులు, ఒత్తిడి తట్టుకోలేక ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.  ఆ తరువాత అధిష్ఠానం మాటను శిరసవహిస్తున్నానంటూ రాజీనామా చేశారు.  అది వేరే సంగతి. 

1983లో టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరుపొందిన చెలసాని ఆంజనేయుల పట్ల అధిష్టానం ప్రవర్తించిన తీరుపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని, రైతుల్లో ఎంతో మంచి పేరున్న నాయకుడిని ఇలా అవమానకర రీతిలో పదవి నుంచి దిగిపోవాలని హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలపై ప్రముఖ విశ్లేషకుడు సువేరా తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  నారా లోకేష్ తీరు సమంజసంగా లేదన్నారు. 

గన్నవరం నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, అవకాశవాదులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల స్థానిక పార్టీలో వర్గపోరు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరంచారు. మద్యం ముఠాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావంతో లోకేష్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న సందేహం వ్యక్తం చేశారు. 

నారా లోకేష్ చుట్టూ ఉన్న కోటరీ చెప్పే మాటలే వింటూ, సోషల్ మీడియా పబ్లిసిటీకే పరిమితమవుతూ క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, సీనియర్ల మనోభావాలను తెలుసుకోకుండా రీల్స్, ప్రచార ఆర్భాటాలను నమ్ముకుంటే గతంలో వైసీపీకి  పట్టిన గతే తెలుగుదేశం పార్టీకి కూడా పడుతుందని హెచ్చరించారు.  

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన చెలసాని ఆంజనేయులుపై, ఇప్పుడు సొంత పార్టీ నాయకులే కక్షపూరితంగా వ్యవహరించడం   విచారకరమని సువేరా అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం పట్ల జిల్లాలోని రైతాంగం, టిడిపి నేతల్లో కూడా విస్మయం, ఆగ్రహం వ్యక్తమౌతున్న పరిస్థితి ఉందని చెప్పారు.  

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరిచి పదవులు ఇస్తూ, పార్టీకి వెన్నుముకలా నిలిచిన పాత నాయకులను విస్మరించడం జిల్లాలో పార్టీ పునాదులను కదిలిస్తుందని సువేరా పేర్కొన్నారు. దేవినేని ఉమా వంటి ఉద్దండ సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టడం ఏమిటని నిలదీశారు.  ఇప్పటికైనా టిడిపి అధిష్టానం, నారా లోకేష్ క్షేత్రస్థాయి పరిస్థితిని గ్రహించి సీనియర్ నాయకులకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. 

Nara Lokesh,  TDP Leadership, Chalasani Anjaneyulu Vijaya Dairy, Krishna District TDP Politics,  Senior Leaders Discontent

By
en-us Political News

  
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.