ఫార్చ్యూన్ ఇండియా ప్రభావశీల మహిళల జాబితాలో నారా బ్రహ్మణి
Publish Date:Jul 11, 2026
Advertisement
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా' తాజాగా ప్రకటించిన దేశంలోని 100 మంది ప్రభావశీల మహిళల (100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్) 2026 జాబితాలో ఆమెకు స్థానం లభించింది. వ్యాపార రంగంలో ఆమె ప్రదర్శిస్తున్న అద్భుతమైన నాయకత్వ ప్రతిభకు గాను ఈ జాతీయ స్థాయి గౌరవం దక్కింది. వివిధ రంగాలలో తమదైన ముద్ర వేస్తూ, సమాజంలో గణనీయమైన మార్పు తీసుకువస్తున్న మహిళ లను గుర్తించి ఫార్చ్యూన్ ఇండియా ప్రతి ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను విజయవంతగా నడిపిస్తూ, వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న నారా బ్రహ్మణికి ఈ ఏడాది ఈ జాబితాలో స్థానం లభించింది. కాగా తన సతీమణి సాధించిన ఈ గొప్ప విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో ముందడుగు వేస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఆదర్శంగా నిలవాలని నారాలోకేష్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆకాంక్షించారు. అలాగే.. తన కోడలు సాధించిన ఈ ఘనతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. బ్రహ్మణి అంకితభావం, నిబద్ధత, వ్యాపార నిర్వహణ శైలికి ఈ పురస్కారం నిదర్శనమని పేర్కొంటూ సామాజిక మాధ్యవ వేదిక నుంచి బ్రహ్మనికి అభినందనలు తెలిపారు. బ్రహ్మణి సాధించిన ఈ మైలురాయి కేవలం నారా కుటుంబానికే కాకుండా, యావత్ తెలుగు సమాజానికి గర్వకారణమన్న చంద్రబాబు సమాజంలో స్వయంసమృద్ధి సాధించాలనుకునే ఎందరో యువతులకు, తెలుగు ఆడబిడ్డలకు బ్రాహ్మణి ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని అందిస్తోందని ప్రశంసించారు. Nara Brahmini in Fortune India 100 Most Influential Women List, Nara Brahmani, Nara Lokesh, Nara Chandrababu Naidu, Heritage Foods, Fortune India 100 Most Influential Women 2026, Telugu News
http://www.teluguone.com/news/content/nara-brahmini-in-fortune-india-100-most-influential-women-list-36-225740.html





